ఎన్నఁడు నెఱఁగమమ్మా ఇటువంటిది
(॥పల్లవి॥)
ఎన్నఁడు నెఱఁగమమ్మా ఇటువంటిది
సన్నపుఁ బులకలెల్లా జాజుకొనెనే
(॥ఎన్నఁ॥)
వుప్పతిల్లు వేడుకతో వొద్దఁ గూచుండి యీతఁడు
చెప్పరానిమాఁటలాడీఁ జెవిలోనను
చిప్పిలి మనసు చొక్కి చెమరించె మేనెల్లా
ఇప్పు డిదివో చెలియా ఇది యేటిదే
(॥ఎన్నఁ॥)
ఆయములు సోఁకించి యట్టె పచ్చడము గప్పి
సేయరాని చేఁత సేసె చేతులు చాఁచి
పాయపు మదము రేఁగి పక్కనఁ గుచ్చెల జారె
యేయెడఁ గన్నది గాదు యెట్టి కొత్తలే
(॥ఎన్నఁ॥)
వువ్విళ్ళూరఁ బెనఁగుతా నుద్దండానఁ బానుపుపై
నవ్వరాని నవ్వు నవ్వీ నాతోడను
చివ్వన నలమేల్మంగ శ్రీవేంకటేశుఁడు నన్ను
యివ్వల మన్నించి యేలె యిఁక నే నేమందునే
(||pallavi||)
ĕnnam̐ḍu nĕṟam̐gamammā iḍuvaṁṭidi
sannabum̐ bulagalĕllā jājugŏnĕne
(||ĕnnam̐||)
vuppadillu veḍugado vŏddam̐ gūsuṁḍi yīdam̐ḍu
sĕpparānimām̐ṭalāḍīm̐ jĕvilonanu
sippili manasu sŏkki sĕmariṁchĕ menĕllā
ippu ḍidivo sĕliyā idi yeḍide
(||ĕnnam̐||)
āyamulu som̐kiṁchi yaṭṭĕ pachchaḍamu gappi
seyarāni sem̐ta sesĕ sedulu sām̐si
pāyabu madamu rem̐gi pakkanam̐ guchchĕla jārĕ
yeyĕḍam̐ gannadi gādu yĕṭṭi kŏttale
(||ĕnnam̐||)
vuvviḽḽūram̐ bĕnam̐gudā nuddaṁḍānam̐ bānububai
navvarāni navvu navvī nādoḍanu
sivvana nalamelmaṁga śhrīveṁkaḍeśhum̐ḍu nannu
yivvala manniṁchi yelĕ yim̐ka ne nemaṁdune