Ennamdu maṟavavachchu yee semtalu

ఎన్నఁడు మఱవవచ్చు యీ చేఁతలు
Language

(॥పల్లవి॥)
ఎన్నఁడు మఱవవచ్చు యీ చేఁతలు
విన్న కన్నవారికెల్ల వింతలివి కావా

(॥ఎన్న॥)
వున్నతి నీవాపెవొద్దనుండి నాకె మోహించి
సన్న సేసి పిలుచుటే చాలదా నాకు
మన్నించి నీ వాకెతోడ మాటలాడుతా నాదిక్కు
కన్నులఁ జూచినదే కానరాదా మేలు

(॥ఎన్న॥)
చయ్యన నాపె నీవు చదురంగమాడుతాను
పైయ్యెత్తు చెప్పుమంటివి బాపురా నన్ను
వుయ్యాలపై నాకె నీవు వుండి నన్ను రమ్మంటా
పయ్యద వట్టి తీసితి పంతమిది గాదా

(॥ఎన్న॥)
చలివాయ నాపె నీవు సరసములాడుతాను
సెలవి నాతో నవ్వితి చెల్లదా నీకు
యెలమి శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
చెలిచేత మొక్కించితి చెప్పరాదు మోహము

(||pallavi||)
ĕnnam̐ḍu maṟavavachchu yī sem̐talu
vinna kannavārigĕlla viṁtalivi kāvā

(||ĕnna||)
vunnadi nīvābĕvŏddanuṁḍi nāgĕ mohiṁchi
sanna sesi pilusuḍe sāladā nāgu
manniṁchi nī vāgĕdoḍa māḍalāḍudā nādikku
kannulam̐ jūsinade kānarādā melu

(||ĕnna||)
sayyana nābĕ nīvu saduraṁgamāḍudānu
paiyyĕttu sĕppumaṁṭivi bāburā nannu
vuyyālabai nāgĕ nīvu vuṁḍi nannu rammaṁṭā
payyada vaṭṭi tīsidi paṁtamidi gādā

(||ĕnna||)
salivāya nābĕ nīvu sarasamulāḍudānu
sĕlavi nādo navvidi sĕlladā nīgu
yĕlami śhrīveṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
sĕliseda mŏkkiṁchidi sĕpparādu mohamu