Ennamdu leni gurudulide neemenam gamtimi

ఎన్నఁడు లేని గురుతులిదె నీమేనఁ గంటిమి
Language

(॥పల్లవి॥)
ఎన్నఁడు లేని గురుతులిదె నీమేనఁ గంటిమి
సన్నల యీ సుద్దులెట్లు చవి సేసేవే

(॥ఎన్న॥)
చెదరెను నీకురులు చెమట చెక్కుల నిండె
యెదురి మెచ్చఁగ నర్థమేమి చెప్పేవే
వదలె నీమొలనూలు వాడెను నీకెమ్మోవి
పొదలి యిందుకెట్లా బొంకఁగలవే

(॥ఎన్న॥)
కంకణాలు వదలెను గందపుఁబూఁత చిట్లె
వంకలొత్తి యిందుకెట్టు వాదించేవే
సుంకుమోపెఁ బలుకులఁ జూపులఁ గొత్తలు దోఁచె
సంకెలేక యివియెట్లు సటలనేవే

(॥ఎన్న॥)
మోమునఁ గళలు నించె ముక్కున నిట్టుర్పురేఁగె
యీమాటకుత్తరమెట్లిచ్చేవే మాకు
ఆముక శ్రీ వేంకటేశుఁడన్నిటాను నిన్నుఁగూడె
ఆమని సెలవినవ్వులాఁపనెట్లు వచ్చునే

(||pallavi||)
ĕnnam̐ḍu leni gurudulidĕ nīmenam̐ gaṁṭimi
sannala yī suddulĕṭlu savi seseve

(||ĕnna||)
sĕdarĕnu nīgurulu sĕmaḍa sĕkkula niṁḍĕ
yĕduri mĕchcham̐ga nardhamemi sĕppeve
vadalĕ nīmŏlanūlu vāḍĕnu nīgĕmmovi
pŏdali yiṁdugĕṭlā bŏṁkam̐galave

(||ĕnna||)
kaṁkaṇālu vadalĕnu gaṁdabum̐būm̐ta siṭlĕ
vaṁkalŏtti yiṁdugĕṭṭu vādiṁcheve
suṁkumobĕm̐ balugulam̐ jūbulam̐ gŏttalu dom̐sĕ
saṁkĕlega yiviyĕṭlu saḍalaneve

(||ĕnna||)
momunam̐ gaḽalu niṁchĕ mukkuna niṭṭurburem̐gĕ
yīmāḍaguttaramĕṭlichcheve māgu
āmuga śhrī veṁkaḍeśhum̐ḍanniḍānu ninnum̐gūḍĕ
āmani sĕlavinavvulām̐panĕṭlu vachchune