ఎన్నఁడు గడించుకొంటి వీకెను నీవు
(॥పల్లవి॥)
ఎన్నఁడు గడించుకొంటి వీకెను నీవు
యెన్నరాదు దీని పగటెవ్వతోయీ
(॥ఎన్న॥)
పెదవులవిడేలతోఁ బిక్కటిల్లుచన్నులతో
యెదుటనే నిలుచున్న దెవ్వతోయీ
వుదుటులు చూప్పుకొంటా నుబ్బించి నవ్వుకొంటా
యిదివో నీదిక్కే చూచీ నెవ్వతోయి
(॥ఎన్న॥)
సోమ్ములతో విఱ్ఱవీఁగి సొలపుల మాటాడుతా
యెమ్మెలెల్లాఁ జూపీని యెవ్వతోయి
నిమ్మపండెగరవేసీ నీటుతోను మురిసీని
యిమ్ముల బిటారికత్తే యిదెవ్వతోయి -
(॥ఎన్న॥)
వలపు నీపైఁ జల్లి వద్దనే కూచుండి నిన్ను
నెలయించీ సారెకు నెవ్వతోయి
వెలయ నేలితివి శ్రీవేంకటేశ నన్ను నిట్టే
యెలమిఁ జుట్టమైవున్న దెవ్వతోయీ
(||pallavi||)
ĕnnam̐ḍu gaḍiṁchugŏṁṭi vīgĕnu nīvu
yĕnnarādu dīni pagaḍĕvvadoyī
(||ĕnna||)
pĕdavulaviḍeladom̐ bikkaḍillusannulado
yĕduḍane nilusunna dĕvvadoyī
vuduḍulu sūppugŏṁṭā nubbiṁchi navvugŏṁṭā
yidivo nīdikke sūsī nĕvvadoyi
(||ĕnna||)
sommulado viṭravīm̐gi sŏlabula māḍāḍudā
yĕmmĕlĕllām̐ jūbīni yĕvvadoyi
nimmabaṁḍĕgaravesī nīḍudonu murisīni
yimmula biḍārigatte yidĕvvadoyi -
(||ĕnna||)
valabu nībaim̐ jalli vaddane kūsuṁḍi ninnu
nĕlayiṁchī sārĕgu nĕvvadoyi
vĕlaya nelidivi śhrīveṁkaḍeśha nannu niṭṭe
yĕlamim̐ juṭṭamaivunna dĕvvadoyī