ఎన్నఁడు దేవుని గనే మెన్నఁడు బుద్ధెఱిఁగేము
(॥పల్లవి॥)
ఎన్నఁడు దేవుని గనే మెన్నఁడు బుద్ధెఱిఁగేము
తన్నుఁ దానే హరి మమ్ము దయఁ జూచెఁ గాకా
(॥ఎన్నడు॥)
మాటాడు టొక్కటే కాని మాకునుఁ బసులకు
చాటువఁ బంచేంద్రియాలు సర్వసమమే
గాటానఁ జరియించుటే కాని రాళ్ళకును మాకు
యీటులేని భవబందా ఎన్నియును సమమే
(॥ఎన్నడు॥)
దొడ్డదేహ మింతే కాని దోమలకు మాకును
జడ్డు లేని జీవాత్మ సర్వసమమే
ఒడ్డిన రుచు లెఱుఁగు దొడ్డవిశేషమే కాని
యెడ్డెతనము మాకైతే నీజంతుసమమే
(॥ఎన్నడు॥)
చేరి చదువుటేకాని చిలుకలకు మాకును
సారెకు నక్షరములు సర్వసమమే
యీరీతి శ్రీ వేంకటేశుఁడిటు నన్నుఁ గాచెఁ గాక
నేరమి యిన్నాళ్ళు నాడేనే నిందరి సమమే
(||pallavi||)
ĕnnam̐ḍu devuni gane mĕnnam̐ḍu buddhĕṟim̐gemu
tannum̐ dāne hari mammu dayam̐ jūsĕm̐ gāgā
(||ĕnnaḍu||)
māḍāḍu ṭŏkkaḍe kāni māgunum̐ basulagu
sāḍuvam̐ baṁcheṁdriyālu sarvasamame
gāḍānam̐ jariyiṁchuḍe kāni rāḽḽagunu māgu
yīḍuleni bhavabaṁdā ĕnniyunu samame
(||ĕnnaḍu||)
dŏḍḍadeha miṁte kāni domalagu māgunu
jaḍḍu leni jīvātma sarvasamame
ŏḍḍina rusu lĕṟum̐gu dŏḍḍaviśheṣhame kāni
yĕḍḍĕdanamu māgaide nījaṁtusamame
(||ĕnnaḍu||)
seri saduvuḍegāni silugalagu māgunu
sārĕgu nakṣharamulu sarvasamame
yīrīdi śhrī veṁkaḍeśhum̐ḍiḍu nannum̐ gāsĕm̐ gāga
nerami yinnāḽḽu nāḍene niṁdari samame