Ennamdoo neramgamu iduvamti kottalu

ఎన్నఁడూ నెరఁగము ఇటువంటి కొత్తలు
Language

(॥పల్లవి॥)
ఎన్నఁడూ నెరఁగము ఇటువంటి కొత్తలు
ఇన్నిటా నీ కీపె పొందు లెట్లబ్బెనయ్య

(॥ఎన్నఁ॥)
కరఁగి కరఁగి సారె కాంత నీతో మాఁటలాడీ
యెరవో సతమో యీకె యెవ్వతెయ్యా
కెరలి కెరలి లోలో కిల కిల నవ్వు నవ్వీ
తెరలోని కెందుండి తెచ్చుకొంటివయ్యా

(॥ఎన్నఁ॥)
తగిలి తగిలి నీకుఁ దమకము రేఁచీని
చిగురో చేఁగో యీపెఁ జెప్పవయ్యా
మొగమెత్తి మొగమెత్తి మోవి నీకుఁ జూపీని
సొగిసి నీ కెన్నాళ్ల చుట్టరికమయ్యా

(॥ఎన్నఁ॥)
వీడె మిచ్చి వీడె మిచ్చి వేఁడుకొనీ జెక్కు నొక్కి
వేడుకో వాడికో యీపె విధ మేదయ్యా
యీడనే శ్రీవేంకటేశ యిటు నన్ను నేలితివి
వాడలో నీ వీకె నెట్లా వలపించితివయ్యా

(||pallavi||)
ĕnnam̐ḍū nĕram̐gamu iḍuvaṁṭi kŏttalu
inniḍā nī kībĕ pŏṁdu lĕṭlabbĕnayya

(||ĕnnam̐||)
karam̐gi karam̐gi sārĕ kāṁta nīdo mām̐ṭalāḍī
yĕravo sadamo yīgĕ yĕvvadĕyyā
kĕrali kĕrali lolo kila kila navvu navvī
tĕraloni kĕṁduṁḍi tĕchchugŏṁṭivayyā

(||ĕnnam̐||)
tagili tagili nīgum̐ damagamu rem̐sīni
siguro sem̐go yībĕm̐ jĕppavayyā
mŏgamĕtti mŏgamĕtti movi nīgum̐ jūbīni
sŏgisi nī kĕnnāḽla suṭṭarigamayyā

(||ĕnnam̐||)
vīḍĕ michchi vīḍĕ michchi vem̐ḍugŏnī jĕkku nŏkki
veḍugo vāḍigo yībĕ vidha medayyā
yīḍane śhrīveṁkaḍeśha yiḍu nannu nelidivi
vāḍalo nī vīgĕ nĕṭlā valabiṁchidivayyā