ఎన్నఁ డెఱిఁగేవు నీవు ఇంతి నీపైఁ జేసే బత్తి
(॥పల్లవి॥)
ఎన్నఁ డెఱిఁగేవు నీవు ఇంతి నీపైఁ జేసే బత్తి
సన్న యెరిఁగి ఇప్పుడే చనవియ్యరాదా
(॥ఎన్నఁ॥)
చెలియ నీకుఁ గతలు చెప్పి చెప్పి దప్పిగొనె
యెలమిఁ గప్పురబాగా లియ్యరాదా
మెలుపునఁ బాదాలొత్తి మేనెల్లఁ జెమరించే
వెలయ సురటిఁగొని విసరరాదా
(॥ఎన్నఁ॥)
సతి వూడిగాలు సేసి సారెకు మేను బడలె
ఇతవుగా మోవిపండు ఇయ్యఁగరాదా
తతితో జూజాలాడి తమకించి బుసకొట్టె
పతివి నీతొడమీఁదఁ బవ్వళింపించరాదా
(॥ఎన్నఁ॥)
మగువ నీతోఁ గూడి మనసు నివ్వెరగందె
జిగిగోర నెచ్చరిక సేయఁగరాదా
నిగిడి శ్రీవేంకటేశ నీతో జాగరాలు సేసె
మిగులా నిండురతలు మెప్పించరాదా
(||pallavi||)
ĕnnam̐ ḍĕṟim̐gevu nīvu iṁti nībaim̐ jese batti
sanna yĕrim̐gi ippuḍe sanaviyyarādā
(||ĕnnam̐||)
sĕliya nīgum̐ gadalu sĕppi sĕppi dappigŏnĕ
yĕlamim̐ gappurabāgā liyyarādā
mĕlubunam̐ bādālŏtti menĕllam̐ jĕmariṁche
vĕlaya suraḍim̐gŏni visararādā
(||ĕnnam̐||)
sadi vūḍigālu sesi sārĕgu menu baḍalĕ
idavugā movibaṁḍu iyyam̐garādā
tadido jūjālāḍi tamagiṁchi busagŏṭṭĕ
padivi nīdŏḍamīm̐dam̐ bavvaḽiṁpiṁcharādā
(||ĕnnam̐||)
maguva nīdom̐ gūḍi manasu nivvĕragaṁdĕ
jigigora nĕchchariga seyam̐garādā
nigiḍi śhrīveṁkaḍeśha nīdo jāgarālu sesĕ
migulā niṁḍuradalu mĕppiṁcharādā