Ennainam galavu panu lemaneene

ఎన్నైనఁ గలవు పను లేమనీనే
Language

(॥పల్లవి॥)
ఎన్నైనఁ గలవు పను లేమనీనే
చిన్నినగవున నా సిగ్గు వాపుమనవే

(॥ఎన్నై॥)
చిక్కువడ్డనెరులతో చింతతోడి మనసుతో
యిక్కడ నుందాన నన్ను నేమనీనె
వెక్కసానఁ దనకేకా విరహాన నింతైతి
చక్కఁజేసి తానే యీపడి వాపుమనవే

(॥ఎన్నై॥)
కమ్మఁజెమటలతోడఁ గాఁగినమేనితోడ-
నిమ్ముల నుందాన న్ను నేమనీనే
నెమ్మదిఁ దనకొరకే నివ్వెరగున నుందాన
రమ్మని తానే నాతో రాఁపు వలదనవే

(॥ఎన్నై॥)
మనసుకోరికలతో మంచుఁబులకలతోడ
యెనసితిఁ దనతో నే నేమనీనే
యెనలేక శ్రీ వేంకటేశుఁ డిట్టె నన్నుఁ గూడె
తనకేకా యిటులైతి దయఁజూడుమనవే

(||pallavi||)
ĕnnainam̐ galavu panu lemanīne
sinninagavuna nā siggu vābumanave

(||ĕnnai||)
sikkuvaḍḍanĕrulado siṁtadoḍi manasudo
yikkaḍa nuṁdāna nannu nemanīnĕ
vĕkkasānam̐ danagegā virahāna niṁtaidi
sakkam̐jesi tāne yībaḍi vābumanave

(||ĕnnai||)
kammam̐jĕmaḍaladoḍam̐ gām̐ginamenidoḍa-
nimmula nuṁdāna nnu nemanīne
nĕmmadim̐ danagŏrage nivvĕraguna nuṁdāna
rammani tāne nādo rām̐pu valadanave

(||ĕnnai||)
manasugorigalado maṁchum̐bulagaladoḍa
yĕnasidim̐ danado ne nemanīne
yĕnalega śhrī veṁkaḍeśhum̐ ḍiṭṭĕ nannum̐ gūḍĕ
tanagegā yiḍulaidi dayam̐jūḍumanave