ఎన్నైనాఁ గలవు పనులెప్పుడూ నీకు
(॥పల్లవి॥)
ఎన్నైనాఁ గలవు పనులెప్పుడూ నీకు
కన్నియ వెూహమెఱిఁగి కరుణించవయ్యా
(॥॥)
మాఁటకు మాటాడితేను మాపుదాఁకాఁ బట్టి జోలి
యేఁటికి విచ్చేయవయ్య యింతికడకు
నీటుతో వాకిటనే నిలుచున్నది యప్పుడు
గాఁటముగ వేగమే సింగారించుకోవయ్యా
(॥॥)
నవ్వుకు నవ్వు నవ్వితే నాలితనమే నిండు
రవ్వసేయక రావయ్య రామకడకు
దివ్వెలవెలుఁగున యీదిక్కే మొగమై యున్నది
చివ్వనఁ గైదండగా నాచెయి వట్టుకోవయ్యా
(॥॥)
అడుగుకడుగిడితే నద్దమరాతిరి వట్టు
జడియక రావయ్య సతికడకు
అడరి శ్రీవేంకటేశ ఆకె ఇందు వచ్చి కూడె
బడినే నీవు వత్తువు బాసలియ్యవయ్యా
(||pallavi||)
ĕnnainām̐ galavu panulĕppuḍū nīgu
kanniya vĕూhamĕṟim̐gi karuṇiṁchavayyā
(||||)
mām̐ṭagu māḍāḍidenu mābudām̐kām̐ baṭṭi joli
yem̐ṭigi vichcheyavayya yiṁtigaḍagu
nīḍudo vāgiḍane nilusunnadi yappuḍu
gām̐ṭamuga vegame siṁgāriṁchugovayyā
(||||)
navvugu navvu navvide nālidaname niṁḍu
ravvaseyaga rāvayya rāmagaḍagu
divvĕlavĕlum̐guna yīdikke mŏgamai yunnadi
sivvanam̐ gaidaṁḍagā nāsĕyi vaṭṭugovayyā
(||||)
aḍugugaḍugiḍide naddamarādiri vaṭṭu
jaḍiyaga rāvayya sadigaḍagu
aḍari śhrīveṁkaḍeśha āgĕ iṁdu vachchi kūḍĕ
baḍine nīvu vattuvu bāsaliyyavayyā