ఎన్నడు నీ దయ మాపై నిఁకఁ బెట్టేవు
(॥పల్లవి॥)
ఎన్నడు నీ దయ మాపై నిఁకఁ బెట్టేవు
తిన్నని యెడమాటలఁ దెల్లవార వచ్చెను
(॥ఎన్నడు॥)
కొంగు వట్టినవాఁడవు గుట్ట గొంత నడుపేవు
అంగవించి జాణవు గా వని యందునా
చెంగట నిందరిలోన సిగ్గుపడి వుందానను
వుంగిటి దీరనివేళ నూరడించ వలదా
(॥ఎన్నడు॥)
చెక్కు నొక్కినవాఁడవు చెప్పవు ఆమీఁదిమాట
లెక్కించి నీ ప్రేమ నాపై లే దందునా
తక్కక యాపనులకె తలవంచుకుందానను
అక్కరతో యీవేళ నాదరించ వలదా
(॥ఎన్నడు॥)
యియ్యకొన్నట్టివాఁడవు యెదురు చేయి చాఁచేవు
నెయ్యపు సరసములు నేర వందునా
యియ్యెడ శ్రీవెంకటేశ యిందుకె కూడుందానను
వొయ్యన నీ మన్ననల నోలలార్చ వలదా
(||pallavi||)
ĕnnaḍu nī daya mābai nim̐kam̐ bĕṭṭevu
tinnani yĕḍamāḍalam̐ dĕllavāra vachchĕnu
(||ĕnnaḍu||)
kŏṁgu vaṭṭinavām̐ḍavu guṭṭa gŏṁta naḍubevu
aṁgaviṁchi jāṇavu gā vani yaṁdunā
sĕṁgaḍa niṁdarilona siggubaḍi vuṁdānanu
vuṁgiḍi dīraniveḽa nūraḍiṁcha valadā
(||ĕnnaḍu||)
sĕkku nŏkkinavām̐ḍavu sĕppavu āmīm̐dimāḍa
lĕkkiṁchi nī prema nābai le daṁdunā
takkaga yābanulagĕ talavaṁchuguṁdānanu
akkarado yīveḽa nādariṁcha valadā
(||ĕnnaḍu||)
yiyyagŏnnaṭṭivām̐ḍavu yĕduru seyi sām̐sevu
nĕyyabu sarasamulu nera vaṁdunā
yiyyĕḍa śhrīvĕṁkaḍeśha yiṁdugĕ kūḍuṁdānanu
vŏyyana nī mannanala nolalārsa valadā