Ennadu leni gunamu yela vachche neegunu

ఎన్నడు లేని గుణము యేల వచ్చె నీకును
Language

(॥పల్లవి॥)
ఎన్నడు లేని గుణము యేల వచ్చె నీకును
మొన్నటి నిన్నటి పొందు మొగచాట్లాయనో

(॥॥)
బత్తి నేనెంత సేసినా భళియని మెచ్చవు
చిత్తము రాదో నీకు చెప్పుమా నాకు
వొత్తిమెంత వేఁడుకొన్న వూరకే వున్నాఁడవు
వత్తులుఁ గూకులునై వలపు విరిగెనో

(॥॥)
వీడెము చేతికిచ్చితే వేగమే వేసుకొనవు
తాడుపడెనో మతి తమకములు
పాడితో నీకు మొక్కితే పక్కన దీవించవు
వేడుక రతులలోన వేసటలు వుట్టెనో

(॥॥)
కాఁగిట బిగించితే బింకములాడ విప్పుడైతే
వీఁగని పరవశాలు వెల్లిగొనెనో
ఆఁగితి శ్రీవేంకటేశ అలమేలుమంగ నేను
మాఁగిన మోవి చేకొంటి మన్ననలిచ్చితివో

(||pallavi||)
ĕnnaḍu leni guṇamu yela vachchĕ nīgunu
mŏnnaḍi ninnaḍi pŏṁdu mŏgasāṭlāyano

(||||)
batti nenĕṁta sesinā bhaḽiyani mĕchchavu
sittamu rādo nīgu sĕppumā nāgu
vŏttimĕṁta vem̐ḍugŏnna vūrage vunnām̐ḍavu
vattulum̐ gūgulunai valabu virigĕno

(||||)
vīḍĕmu sedigichchide vegame vesugŏnavu
tāḍubaḍĕno madi tamagamulu
pāḍido nīgu mŏkkide pakkana dīviṁchavu
veḍuga radulalona vesaḍalu vuṭṭĕno

(||||)
kām̐giḍa bigiṁchide biṁkamulāḍa vippuḍaide
vīm̐gani paravaśhālu vĕlligŏnĕno
ām̐gidi śhrīveṁkaḍeśha alamelumaṁga nenu
mām̐gina movi segŏṁṭi mannanalichchidivo