ఎన్నటికి జీవుఁడిఁక నీడేరేది
(॥పల్లవి॥)
ఎన్నటికి జీవుఁడిఁక నీడేరేది
పన్నుకొనేటి చింతలే బలిసీఁ గాని
(॥ఎన్న॥)
కలరు వివేకులు కలదిటు ధర్మము
కలఁడు దైవము నేఁడు గావలెనంటే
వలవని సందేహాన వట్టిజాలిఁ బొరలేటి-
తలపోఁత లేమిటికో తడఁబడీఁ గాని
(॥ఎన్న॥)
వున్నవి వేదశాస్త్రాలు వున్నది విశ్వాసము
వున్నవాఁ డాచార్యుఁడు వుపదేశించ
తన్నుఁ దానే మోసపోయి తత్త్వము నిశ్చయించక
మిన్నక చంచలమేలో మెరసీఁ గాని
(॥ఎన్న॥)
యివిగో పుణ్యనిధులు యిదిగో సంకీర్తన
వివరింప వీఁడిగో శ్రీవేంకటేశుఁడు
భవములచే భ్రమసి బహుసంగతులచేత
యివల నామనసిప్పు డెఱిఁగీఁ గాని
(||pallavi||)
ĕnnaḍigi jīvum̐ḍim̐ka nīḍeredi
pannugŏneḍi siṁtale balisīm̐ gāni
(||ĕnna||)
kalaru vivegulu kaladiḍu dharmamu
kalam̐ḍu daivamu nem̐ḍu gāvalĕnaṁṭe
valavani saṁdehāna vaṭṭijālim̐ bŏraleḍi-
talabom̐ta lemiḍigo taḍam̐baḍīm̐ gāni
(||ĕnna||)
vunnavi vedaśhāstrālu vunnadi viśhvāsamu
vunnavām̐ ḍāsāryum̐ḍu vubadeśhiṁcha
tannum̐ dāne mosaboyi tattvamu niśhchayiṁchaga
minnaga saṁchalamelo mĕrasīm̐ gāni
(||ĕnna||)
yivigo puṇyanidhulu yidigo saṁkīrdana
vivariṁpa vīm̐ḍigo śhrīveṁkaḍeśhum̐ḍu
bhavamulase bhramasi bahusaṁgadulaseda
yivala nāmanasippu ḍĕṟim̐gīm̐ gāni