ఎన్నటి చుట్టరికమో యీపెకు నీకు
(॥పల్లవి॥)
ఎన్నటి చుట్టరికమో యీపెకు నీకు
నన్ను నేలితి విపుడు నమ్మించి యిన్నిటాను
(॥ఎన్న॥)
చెనకి చెనకి నీతో చిరునవ్వు నవ్వుకొంటా
మనవు లెంత చెప్పీని మగువ
గునిసి గునిసి సిగ్గు కుప్పలు వోసుకొంటా
పెనఁగులాడె నప్పటి పెక్కుచందములను
(॥ఎన్న॥)
జరసి జరసి మోవి చవులు వుట్టించుకొంటా
మరగులేల పెట్టీని మాఁటలలోన
కరఁగి కరఁగి బత్తి కానుకలు వట్టుకొంటా
గురుతులెట్టు చూపీని గుబ్బలపై నీకు
(॥ఎన్న॥)
తగిలి తగిలి మొక్కి తమకము రేఁచుకొంటా
మొగమేమి చూపీ నీముందరనుండి
జిగి నలమేల్మంగను శ్రీవేంకటేశ యేలితి -
విగురుఁబోఁడి నీ కీపె నిల్లాలయి వున్నది
(||pallavi||)
ĕnnaḍi suṭṭarigamo yībĕgu nīgu
nannu nelidi vibuḍu nammiṁchi yinniḍānu
(||ĕnna||)
sĕnagi sĕnagi nīdo sirunavvu navvugŏṁṭā
manavu lĕṁta sĕppīni maguva
gunisi gunisi siggu kuppalu vosugŏṁṭā
pĕnam̐gulāḍĕ nappaḍi pĕkkusaṁdamulanu
(||ĕnna||)
jarasi jarasi movi savulu vuṭṭiṁchugŏṁṭā
maragulela pĕṭṭīni mām̐ṭalalona
karam̐gi karam̐gi batti kānugalu vaṭṭugŏṁṭā
gurudulĕṭṭu sūbīni gubbalabai nīgu
(||ĕnna||)
tagili tagili mŏkki tamagamu rem̐sugŏṁṭā
mŏgamemi sūbī nīmuṁdaranuṁḍi
jigi nalamelmaṁganu śhrīveṁkaḍeśha yelidi -
vigurum̐bom̐ḍi nī kībĕ nillālayi vunnadi