Ennadi suttarigamo yeebegu neegu

ఎన్నటి చుట్టరికమో యీపెకు నీకు
Language

(॥పల్లవి॥)
ఎన్నటి చుట్టరికమో యీపెకు నీకు
విన్నవించీ నీకెమాఁట వినఁగరాదా

(॥ఎన్న॥)
చలిమి బలిమి నిన్ను సారెసారెఁ గొసరీని
లలన నీవింతటను లాలించరాదా
సొలసి మలసీఁ దనచుట్టరికములు చెప్పి
తెలుపుకొని నీవాపె దిక్కు చూడరాదా

(॥ఎన్న॥)
అనఁగి పెనఁగి నీకు నాసపడి మొక్కీని
మునుకొన్నవలపుల ముంచఁగరాదా
చనవి మనవీఁ జూపి సరసములాడీని
ననుపున నీపెతోను నవ్వఁగరాదా

(॥ఎన్న॥)
కలసి మెలసి నిన్నుఁ గాఁగిటికి నేఁకరీని
తలకొన్న మన్ననలఁ దననుపరాదా
యెలమి శ్రీవేంకటేశ యిటు నన్ను నేలితివి
నెలకొని యీకెనూ మన్నించఁగరాదా

(||pallavi||)
ĕnnaḍi suṭṭarigamo yībĕgu nīgu
vinnaviṁchī nīgĕmām̐ṭa vinam̐garādā

(||ĕnna||)
salimi balimi ninnu sārĕsārĕm̐ gŏsarīni
lalana nīviṁtaḍanu lāliṁcharādā
sŏlasi malasīm̐ danasuṭṭarigamulu sĕppi
tĕlubugŏni nīvābĕ dikku sūḍarādā

(||ĕnna||)
anam̐gi pĕnam̐gi nīgu nāsabaḍi mŏkkīni
munugŏnnavalabula muṁcham̐garādā
sanavi manavīm̐ jūbi sarasamulāḍīni
nanubuna nībĕdonu navvam̐garādā

(||ĕnna||)
kalasi mĕlasi ninnum̐ gām̐giḍigi nem̐karīni
talagŏnna mannanalam̐ dananubarādā
yĕlami śhrīveṁkaḍeśha yiḍu nannu nelidivi
nĕlagŏni yīgĕnū manniṁcham̐garādā