Ennadi suttarigamo yeebegu neegu

ఎన్నటి చుట్టరికమో యీపెకు నీకు
Language

(॥పల్లవి॥)
ఎన్నటి చుట్టరికమో యీపెకు నీకు
సన్నల మొక్కులు మొక్కి సంతసించరాదా

(॥ఎన్న॥)
వాలుకచూపులఁ జూచి వావుల చెప్పీఁ జెలి
ఆలించి విని కూచుండుమనరాదా
చేలకొంగు మాఁటు నేసి చిఱుత నవ్వులు నవ్వీ
కేలుచాఁచి వలపులు కెరలించరాదా

(॥ఎన్న॥)
చేరి తనమోము చూపి సిగ్గులు నెరపీ నీకె
జారుఁగొప్పు చక్కఁబెట్టి చనవీరాదా
నేరువుతో నోయ్యారాన నిలిచి కూరిమి చల్లీ
గారవాన లాలించి కాఁగి లియ్యరాదా

(॥ఎన్న॥)
మోవితేను లూరఁగాను ముందెట నున్నది తాను
చేవదేరె నిఁక నీవు చెనకరాదా
వేవేల కలమేల్మంగవిభుఁడ శ్రీవేంకటేశ
యీవేళ నన్నేలితివి యిద్దరూఁ గూడరాదా

(||pallavi||)
ĕnnaḍi suṭṭarigamo yībĕgu nīgu
sannala mŏkkulu mŏkki saṁtasiṁcharādā

(||ĕnna||)
vālugasūbulam̐ jūsi vāvula sĕppīm̐ jĕli
āliṁchi vini kūsuṁḍumanarādā
selagŏṁgu mām̐ṭu nesi siṟuda navvulu navvī
kelusām̐si valabulu kĕraliṁcharādā

(||ĕnna||)
seri tanamomu sūbi siggulu nĕrabī nīgĕ
jārum̐gŏppu sakkam̐bĕṭṭi sanavīrādā
neruvudo noyyārāna nilisi kūrimi sallī
gāravāna lāliṁchi kām̐gi liyyarādā

(||ĕnna||)
movidenu lūram̐gānu muṁdĕḍa nunnadi tānu
sevaderĕ nim̐ka nīvu sĕnagarādā
vevela kalamelmaṁgavibhum̐ḍa śhrīveṁkaḍeśha
yīveḽa nannelidivi yiddarūm̐ gūḍarādā