Ennadi suttamo yaage neṟamga nenu

ఎన్నటి చుట్టమో యాకె నెఱఁగ నేను
Language

(॥పల్లవి॥)
ఎన్నటి చుట్టమో యాకె నెఱఁగ నేను
అన్నిటా నేనే నీకు నాలనంటా నుందును

(॥॥)
నెలఁత యెవ్వతోకాని నిన్నుఁ బొడఁగన వచ్చె
చెలప చెమటలతో సిగ్గులతోడ
చెలులఁ జెప్పు మనుచుఁ జేరి వాకిట నున్నది
తొలుత నీవాపె మోహము తోఁగి చూడవయ్యా

(॥॥)
వావి నీకెమౌనోకాని, వలపుల మాఁటలాడి
వేవేగఁ దురుముజార విరులురాల
దేవులవలెఁ దలుపు దెరచి లోనికేతెంచె
భావించి యాపె గురుతు పరికించవయ్యా

(॥॥)
యెంతవనికోగాని యేకతము గద్దనీని
సంతోసాలు గడునిండఁ జవులు రేఁగ
యింతలో శ్రీవేంకటేశ యేనలమేలుమంగను
చెంత నన్నేలితి వాకెఁ జిత్తగించవయ్యా

(||pallavi||)
ĕnnaḍi suṭṭamo yāgĕ nĕṟam̐ga nenu
anniḍā nene nīgu nālanaṁṭā nuṁdunu

(||||)
nĕlam̐ta yĕvvadogāni ninnum̐ bŏḍam̐gana vachchĕ
sĕlaba sĕmaḍalado sigguladoḍa
sĕlulam̐ jĕppu manusum̐ jeri vāgiḍa nunnadi
tŏluda nīvābĕ mohamu tom̐gi sūḍavayyā

(||||)
vāvi nīgĕmaunogāni, valabula mām̐ṭalāḍi
vevegam̐ durumujāra virulurāla
devulavalĕm̐ dalubu dĕrasi lonigedĕṁchĕ
bhāviṁchi yābĕ gurudu parigiṁchavayyā

(||||)
yĕṁtavanigogāni yegadamu gaddanīni
saṁtosālu gaḍuniṁḍam̐ javulu rem̐ga
yiṁtalo śhrīveṁkaḍeśha yenalamelumaṁganu
sĕṁta nannelidi vāgĕm̐ jittagiṁchavayyā