ఎన్నటి పొందో నీకు యీకె యెంత చుట్టమో
(॥పల్లవి॥)
ఎన్నటి పొందో నీకు యీకె యెంత చుట్టమో
పన్నుకొని వుండఁగాను పరాకులేలయ్యా
(॥ఎన్న॥)
కడు వేడుకతో నీకు గతలు చెప్పీ నాపె
వుడివోని సంతోసాన నూఁకొనవయ్యా
అడియాలముగఁ జన్ను లదె కానుకసేసీని
బడివాయ కిట్టె తప్పక చూడవయ్యా
(॥ఎన్న॥)
వెలయఁగ మోవితేనె విందులు వెట్టీ నాపె
కొలువులో నిట్టె చవిగోనవయ్యా
చెలఁగి నవ్వు ముత్యాలు సేసలు చల్లీ నీకు
కలసి మెలసి నీవూఁ గైకొనవయ్యా
(॥ఎన్న॥)
చొక్కపు రతులనే జూజములడీ నాపె
వెక్కసమేల పంద్యాలు వేయవయ్యా
ఇక్కడనే శ్రీవేంకటేశ నన్ను నేలితివి
చక్కగా మా యిద్దరితో సరసమాడవయ్యా
(||pallavi||)
ĕnnaḍi pŏṁdo nīgu yīgĕ yĕṁta suṭṭamo
pannugŏni vuṁḍam̐gānu parāgulelayyā
(||ĕnna||)
kaḍu veḍugado nīgu gadalu sĕppī nābĕ
vuḍivoni saṁtosāna nūm̐kŏnavayyā
aḍiyālamugam̐ jannu ladĕ kānugasesīni
baḍivāya kiṭṭĕ tappaga sūḍavayyā
(||ĕnna||)
vĕlayam̐ga movidenĕ viṁdulu vĕṭṭī nābĕ
kŏluvulo niṭṭĕ savigonavayyā
sĕlam̐gi navvu mutyālu sesalu sallī nīgu
kalasi mĕlasi nīvūm̐ gaigŏnavayyā
(||ĕnna||)
sŏkkabu radulane jūjamulaḍī nābĕ
vĕkkasamela paṁdyālu veyavayyā
ikkaḍane śhrīveṁkaḍeśha nannu nelidivi
sakkagā mā yiddarido sarasamāḍavayyā