Ennadi kennadivaadu lelabemche vimkaanu

ఎన్నటి కెన్నటివాదు లేలపెంచే వింకాను
Language

(॥పల్లవి॥)
ఎన్నటి కెన్నటివాదు లేలపెంచే వింకాను
యెన్న నీకుఁ బంతమిచ్చే నింత చాలదటరా

(॥ఎన్న॥)
నిక్కిచూచి పేరఁబిల్చి నీమన సొక్కటిగాఁగ
మక్కువ చలితి నింకా మఱి యేమనేవురా
చెక్కునొక్కి బుజ్జిగించు చేతిమీఁద జేయిఁ వేసి
మొక్కు మొక్కినా నీవు వెమేల వంచేవురా

(॥ఎన్న॥)
సన్న చేసి కానుకిచ్చి సారె నీతో నవ్వు నవ్వి
కన్నులారిచితి నీకు కడమ లేమాయరా
నిన్ను నట్టె మెచ్చి మెచ్చి నెయ్యముతో మాటలాడి
యెన్నిసేసినా మనసేల కరఁగవురా

(॥ఎన్న॥)
కాలుదొక్కి వేగిరించి కాఁగిటిలో బిగియించి
లాలించినా నాతోను లావుచూపే వేలరా
మేలిమి శ్రీ వేంకటేశ మించి నీవే నన్నుఁ గూడి
యీలీల నేలినవాఁడ విట్టె మన్నించరా

(||pallavi||)
ĕnnaḍi kĕnnaḍivādu lelabĕṁche viṁkānu
yĕnna nīgum̐ baṁtamichche niṁta sāladaḍarā

(||ĕnna||)
nikkisūsi peram̐bilsi nīmana sŏkkaḍigām̐ga
makkuva salidi niṁkā maṟi yemanevurā
sĕkkunŏkki bujjigiṁchu sedimīm̐da jeyim̐ vesi
mŏkku mŏkkinā nīvu vĕmela vaṁchevurā

(||ĕnna||)
sanna sesi kānugichchi sārĕ nīdo navvu navvi
kannulārisidi nīgu kaḍama lemāyarā
ninnu naṭṭĕ mĕchchi mĕchchi nĕyyamudo māḍalāḍi
yĕnnisesinā manasela karam̐gavurā

(||ĕnna||)
kāludŏkki vegiriṁchi kām̐giḍilo bigiyiṁchi
lāliṁchinā nādonu lāvusūbe velarā
melimi śhrī veṁkaḍeśha miṁchi nīve nannum̐ gūḍi
yīlīla nelinavām̐ḍa viṭṭĕ manniṁcharā