ఎన్నటి కెన్నటిసుద్దు లిఁక నేఁటికి తమ
(॥పల్లవి॥)
ఎన్నటి కెన్నటిసుద్దు లిఁక నేఁటికి తమ
కన్నెనాఁటి పడపులు కంటివిగా కొత్తలు
(॥ఎన్న॥)
యేతులకు నీతులు యెవ్వ రేమాడుకొన్నా నేఁ
గాతరించ నేల నీవు గలవు నాకు
ఘాతలఁ దమకునట కడు వలచితివట
యీతలను వింటివిగా యివి గొన్ని కొత్తల
(॥ఎన్న॥)
పోదితో నాసల నిన్నుఁ బొదిగియెవ్వ రుండినా
వాదడువ నేల నావాఁడవు నీవు
సేదదేర తమ్మునట చేసన్న సేసితివట
సోదించి తెలిసితిగా చూడఁజూడఁ గొత్తలూ
(॥ఎన్న॥)
వట్టియాసల నెవ్వరు వడిఁ జేతులు చాఁచినా
నెట్టనఁ గూడున్నాఁడవు నిచ్చలు నన్ను
ముట్టితివట తొల్లెట మొరఁగి శ్రీవేంకటేశ
మట్టుమీరఁ దమకేల మానెఁగా ఆకొత్తలూ
(||pallavi||)
ĕnnaḍi kĕnnaḍisuddu lim̐ka nem̐ṭigi tama
kannĕnām̐ṭi paḍabulu kaṁṭivigā kŏttalu
(||ĕnna||)
yedulagu nīdulu yĕvva remāḍugŏnnā nem̐
gādariṁcha nela nīvu galavu nāgu
ghādalam̐ damagunaḍa kaḍu valasidivaḍa
yīdalanu viṁṭivigā yivi gŏnni kŏttala
(||ĕnna||)
podido nāsala ninnum̐ bŏdigiyĕvva ruṁḍinā
vādaḍuva nela nāvām̐ḍavu nīvu
sedadera tammunaḍa sesanna sesidivaḍa
sodiṁchi tĕlisidigā sūḍam̐jūḍam̐ gŏttalū
(||ĕnna||)
vaṭṭiyāsala nĕvvaru vaḍim̐ jedulu sām̐sinā
nĕṭṭanam̐ gūḍunnām̐ḍavu nichchalu nannu
muṭṭidivaḍa tŏllĕḍa mŏram̐gi śhrīveṁkaḍeśha
maṭṭumīram̐ damagela mānĕm̐gā āgŏttalū