Ennadi kennadi suddu lemchevaa neevu

ఎన్నటి కెన్నటి సుద్దు లెంచేవా నీవు
Language

(॥పల్లవి॥)
ఎన్నటి కెన్నటి సుద్దు లెంచేవా నీవు
కన్ను లెదిటివారినే కరుణింతు గాక

(॥ఎన్న॥)
వొద్దిక రాణివాసాలైవున్నవారిఁ దలఁచేవా
వద్దనున్నవానికే వలతుగాక
తిద్దిని నీగొల్లెత దిక్కు నీవు చూచేవా
పెద్ద మధురసతులే ప్రియమింతే కాక

(॥ఎన్న॥)
వేడుకతో వరుసల వెలఁదుల నీవెంచేవా
వూడిగాలవారు నీవు నుండుదు గాక
యీడఁ బెండ్లాడినయట్టి ఇంతులనే తనిసేవా
కూడగొట్టు వనితలఁ గోరుదువు గాక

(॥ఎన్న॥)
కప్పురపుఁబడివారి కతలు నీవు వినేవా
యిప్పు డురముపైవారి నెనతు గాక
తప్పక శ్రీ వేంకటేశ తగ నన్నుఁ గూడితివి
అప్పటి నీతొంటివారి నంటుదువుగాక

(||pallavi||)
ĕnnaḍi kĕnnaḍi suddu lĕṁchevā nīvu
kannu lĕdiḍivārine karuṇiṁtu gāga

(||ĕnna||)
vŏddiga rāṇivāsālaivunnavārim̐ dalam̐sevā
vaddanunnavānige valadugāga
tiddini nīgŏllĕda dikku nīvu sūsevā
pĕdda madhurasadule priyamiṁte kāga

(||ĕnna||)
veḍugado varusala vĕlam̐dula nīvĕṁchevā
vūḍigālavāru nīvu nuṁḍudu gāga
yīḍam̐ bĕṁḍlāḍinayaṭṭi iṁtulane tanisevā
kūḍagŏṭṭu vanidalam̐ goruduvu gāga

(||ĕnna||)
kappurabum̐baḍivāri kadalu nīvu vinevā
yippu ḍuramubaivāri nĕnadu gāga
tappaga śhrī veṁkaḍeśha taga nannum̐ gūḍidivi
appaḍi nīdŏṁṭivāri naṁṭuduvugāga