ఎన్నటి కెన్నటి పొందు లేమే తాను
(॥పల్లవి॥)
ఎన్నటి కెన్నటి పొందు లేమే తాను
సన్నల తా వద్దనీని సాదా తాను
(॥ఎన్నటి॥)
మొక్కలాన నీవు నేను మోరతాపు లాడఁగాను
చక్కట్లు చెప్పవచ్చీ సవతే తాను
వుక్కుమీరి నే నిన్ను వుద్దండాలు సేయఁగాను
దిక్కై వచ్చీ నీపాలి దేవరా తాను
(॥ఎన్నటి॥)
కొలఁది మీ రిద్దరము కొంగులు వట్టి తియ్యఁగా
సొలసి యడ్డాలు వచ్చీఁ జుట్టమా తాను
బలిమి నీచేత నేను బాసలు సేయించుకోఁగా
యెలమి ని న్నదలించీ యేలికా తాను
(॥ఎన్నటి॥)
జట్టిగొని మనలోన సరసము లాడఁగాను
అట్టే యందులకు వచ్చీ నాలా తాను
నెట్టన శ్రీవేంకటేశ నీవు నన్నుఁ గూడఁగాను
గుట్టున బుద్దులు చెప్పేగురువా తాను
(||pallavi||)
ĕnnaḍi kĕnnaḍi pŏṁdu leme tānu
sannala tā vaddanīni sādā tānu
(||ĕnnaḍi||)
mŏkkalāna nīvu nenu moradābu lāḍam̐gānu
sakkaṭlu sĕppavachchī savade tānu
vukkumīri ne ninnu vuddaṁḍālu seyam̐gānu
dikkai vachchī nībāli devarā tānu
(||ĕnnaḍi||)
kŏlam̐di mī riddaramu kŏṁgulu vaṭṭi tiyyam̐gā
sŏlasi yaḍḍālu vachchīm̐ juṭṭamā tānu
balimi nīseda nenu bāsalu seyiṁchugom̐gā
yĕlami ni nnadaliṁchī yeligā tānu
(||ĕnnaḍi||)
jaṭṭigŏni manalona sarasamu lāḍam̐gānu
aṭṭe yaṁdulagu vachchī nālā tānu
nĕṭṭana śhrīveṁkaḍeśha nīvu nannum̐ gūḍam̐gānu
guṭṭuna buddulu sĕppeguruvā tānu