ఎన్నాళ్లనుండి కాచుక యిందుకే వుంటవో నీవు
(॥పల్లవి॥)
ఎన్నాళ్లనుండి కాచుక యిందుకే వుంటవో నీవు
పన్నిన నీ కోరికలు ఫలియించె నిపుడు
(॥ఎన్నా॥)
చేవదేర నాకె నీకు చేతులెత్తి మొక్తితేను
దేవులవు గమ్మంటా దీవించేవు
వావి చెప్పుమని నిన్ను వాలాయించి యడిగితే
బావనంటా సరసాలె పచారించేవు
(॥ఎన్నా॥)
ముదమున నాకె నీమోము దప్పక చూచితే
ఇదె పెండ్లి లగ్నమంటా నియ్యకొల్పేవు
చెదరకు వూరకే నీచెంత నిలుచుండితే
యెదురేది నీకు నాకు లీడుజోడౌ ననేవు
(॥ఎన్నా॥)
మక్కువల నాకె నీతో మంచి మాఁటాడితే మోవిఁ
జక్కెర చిందీనంటాఁ జవి చూచేవు
యిక్కడ శ్రీవేంకటేశ యెరిఁగి తా నవ్వితేను
గక్కన మెచ్చితినంటాఁ గాఁగిలించేవు
(||pallavi||)
ĕnnāḽlanuṁḍi kāsuga yiṁduge vuṁṭavo nīvu
pannina nī korigalu phaliyiṁchĕ nibuḍu
(||ĕnnā||)
sevadera nāgĕ nīgu sedulĕtti mŏktidenu
devulavu gammaṁṭā dīviṁchevu
vāvi sĕppumani ninnu vālāyiṁchi yaḍigide
bāvanaṁṭā sarasālĕ pasāriṁchevu
(||ĕnnā||)
mudamuna nāgĕ nīmomu dappaga sūside
idĕ pĕṁḍli lagnamaṁṭā niyyagŏlbevu
sĕdaragu vūrage nīsĕṁta nilusuṁḍide
yĕduredi nīgu nāgu līḍujoḍau nanevu
(||ĕnnā||)
makkuvala nāgĕ nīdo maṁchi mām̐ṭāḍide movim̐
jakkĕra siṁdīnaṁṭām̐ javi sūsevu
yikkaḍa śhrīveṁkaḍeśha yĕrim̐gi tā navvidenu
gakkana mĕchchidinaṁṭām̐ gām̐giliṁchevu