ఎన్నాళ్లనుండి కాచేవో యిందుకుఁగాను
(॥పల్లవి॥)
ఎన్నాళ్లనుండి కాచేవో యిందుకుఁగాను
వన్నెలఁ జూడవచ్చినవారిఁ జుట్టుకొనేవు
(॥ఎన్నా॥)
కన్నుల నవ్విన దాపె గయ్యాళించిన దాపె
నన్ను నీవు గొరనేల నాఁటించేవు
పన్ని జూదాలాడె నాపె పందెలువేసె నాపె
చన్నులంటి నాపయ్యద జారనేల తీసేవు
(॥ఎన్నా॥)
వొడివట్టితీసె నాపె వుదుటులు చూపె నాపె
నడుమఁ బువ్వులనేల నన్ను వేసేవు
వెడవంతాలాడె నాపె వేసెను నీసారె లాపె
జడవట్టి నన్నునేల సరిఁ జెనకేవు
(॥ఎన్నా॥)
చేముట్టి పెనఁగె నాపె చేఁతలెల్లాఁ జేసె నాప
నామొగముచూచేల సన్నలు సేసేవు
ఆనుక శ్రీవేంకటేశ అలమేలుమంగపతివి
కామించి నన్నేలి యంత కడు రట్టుసేసేవు
(||pallavi||)
ĕnnāḽlanuṁḍi kāsevo yiṁdugum̐gānu
vannĕlam̐ jūḍavachchinavārim̐ juṭṭugŏnevu
(||ĕnnā||)
kannula navvina dābĕ gayyāḽiṁchina dābĕ
nannu nīvu gŏranela nām̐ṭiṁchevu
panni jūdālāḍĕ nābĕ paṁdĕluvesĕ nābĕ
sannulaṁṭi nābayyada jāranela tīsevu
(||ĕnnā||)
vŏḍivaṭṭidīsĕ nābĕ vuduḍulu sūbĕ nābĕ
naḍumam̐ buvvulanela nannu vesevu
vĕḍavaṁtālāḍĕ nābĕ vesĕnu nīsārĕ lābĕ
jaḍavaṭṭi nannunela sarim̐ jĕnagevu
(||ĕnnā||)
semuṭṭi pĕnam̐gĕ nābĕ sem̐talĕllām̐ jesĕ nāba
nāmŏgamusūsela sannalu sesevu
ānuga śhrīveṁkaḍeśha alamelumaṁgabadivi
kāmiṁchi nanneli yaṁta kaḍu raṭṭusesevu