Ennaalla kennaallu yideme neevu

ఎన్నాళ్ల కెన్నాళ్లు యిదేమే నీవు
Language

(॥పల్లవి॥)
ఎన్నాళ్ల కెన్నాళ్లు యిదేమే నీవు
విన్నపము లాలకించి విచారించేవు

(॥ఎన్నా॥)
యిన్నిటాను నీవు నన్ను నేలవలె ననుచును
నిన్ను నొడఁబరచుట నేఁడా నేను
కన్నెలు పదారువేలు కలరంటానుండి వచ్చి
చన్నులంటే విది లెస్ససరవాయఁగా

(॥ఎన్నా॥)
చేచేత నాచెప్పినట్టు సేయవలె ననుచును
నీచేత బాస గొంట నేఁడా నేను
యేచి నీవు వేగలేచి యెనమండ్రఁ జక్కఁబెట్టి
కూచుండేవు నావద్ద గుఱుతాయఁగా

(॥ఎన్నా॥)
కైకొని నీవునాతో కాఁపిరము సేతువంటా
నీకుఁ జేతులు చాఁచుట నేఁడా నేను
యీకడ శ్రీవేంకటేశ యిందరినీఁ బొందివచ్చి
మేకొని నన్నుఁ గూడితి మెచ్చాయఁగా

(||pallavi||)
ĕnnāḽla kĕnnāḽlu yideme nīvu
vinnabamu lālagiṁchi visāriṁchevu

(||ĕnnā||)
yinniḍānu nīvu nannu nelavalĕ nanusunu
ninnu nŏḍam̐barasuḍa nem̐ḍā nenu
kannĕlu padāruvelu kalaraṁṭānuṁḍi vachchi
sannulaṁṭe vidi lĕssasaravāyam̐gā

(||ĕnnā||)
seseda nāsĕppinaṭṭu seyavalĕ nanusunu
nīseda bāsa gŏṁṭa nem̐ḍā nenu
yesi nīvu vegalesi yĕnamaṁḍram̐ jakkam̐bĕṭṭi
kūsuṁḍevu nāvadda guṟudāyam̐gā

(||ĕnnā||)
kaigŏni nīvunādo kām̐piramu seduvaṁṭā
nīgum̐ jedulu sām̐suḍa nem̐ḍā nenu
yīgaḍa śhrīveṁkaḍeśha yiṁdarinīm̐ bŏṁdivachchi
megŏni nannum̐ gūḍidi mĕchchāyam̐gā