Enemta neevemta yela gorabusesevu

ఏనెంత నీవెంత యేల గొరబుసేసేవు
Language

(॥పల్లవి॥)
ఏనెంత నీవెంత యేల గొరబుసేసేవు
పూని నన్ను నింతేసి పొగడేవు నీవు

(॥ఏనెం॥)
వింతవింత చేఁతలకు వేడుకకాఁడవు నీవు
సంతసుద్దులునేర్చిన జాణకాఁడవు
సంతోసపు నగవుల జాజరకాఁడవు, నీవు
యెంతైనా నే నిన్ను నెలయించఁగలనా

(॥ఏనెం॥)
వూరివారినెల్లా మెచ్చేవుబ్బరికాఁడవు
కారణము లేక వచ్చే గండికాఁడవు
గోరగీరి యేరుసేసేకొనబుకాఁడవు నీవు
కేరడము లాడి నిన్ను గిలిగించఁగలనా

(॥ఏనెం॥)
ఆలయక రతిఁగూడె ఆసోదకాఁడవు నీవు
కొలఁది మీరినయట్టి కోడెకాఁడవు
యెలమి శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
కలసితి విఁక నిన్ను గరిసించఁగలనా

(||pallavi||)
enĕṁta nīvĕṁta yela gŏrabusesevu
pūni nannu niṁtesi pŏgaḍevu nīvu

(||enĕṁ||)
viṁtaviṁta sem̐talagu veḍugagām̐ḍavu nīvu
saṁtasuddulunersina jāṇagām̐ḍavu
saṁtosabu nagavula jājaragām̐ḍavu, nīvu
yĕṁtainā ne ninnu nĕlayiṁcham̐galanā

(||enĕṁ||)
vūrivārinĕllā mĕchchevubbarigām̐ḍavu
kāraṇamu lega vachche gaṁḍigām̐ḍavu
goragīri yerusesegŏnabugām̐ḍavu nīvu
keraḍamu lāḍi ninnu giligiṁcham̐galanā

(||enĕṁ||)
ālayaga radim̐gūḍĕ āsodagām̐ḍavu nīvu
kŏlam̐di mīrinayaṭṭi koḍĕgām̐ḍavu
yĕlami śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
kalasidi vim̐ka ninnu garisiṁcham̐galanā