ఎనసిన చోటికి నిచ్చకములే మేలు
(॥పల్లవి॥)
ఎనసిన చోటికి నిచ్చకములే మేలు
వినయములెల్లాఁ జేసి వేడుకలే చూపవే
(॥యెన॥)
పగడవాతెర నొక్కి పతి నిన్ను వేఁడుకొనీ
మగువరో యితనితో మాఁటలాడవే
మొగమెత్తి లాలించి ముద్దుటుంగరము వెట్టీ
తగు నీచన్నులు సోఁక దండనే కూచుండవే
(॥యెన॥)
చేతిమీఁదఁ జేయివేసి చెప్పీ నీకుఁ బ్రియములు
నాతిరో నీవితనితో నవ్వు నవ్వవే
కాతరానఁ గాలు దొక్కి కప్పరము నీకు నిచ్చీ
ఆతుమారాఁ గాఁగిలించి యాస లీడేరించవే
(॥యెన॥)
పొలయలుక దేరిచి పొత్తుకు నిన్ను పిలిచీ
చెలియరో యితనితోఁ జెలరేఁగవే
యెలమి శ్రీవేంకటేశుఁ డిన్నటాను నిన్ను నేలె
తలఁచి నట్లానే యీతనితో భోగించవే
(||pallavi||)
ĕnasina soḍigi nichchagamule melu
vinayamulĕllām̐ jesi veḍugale sūbave
(||yĕna||)
pagaḍavādĕra nŏkki padi ninnu vem̐ḍugŏnī
maguvaro yidanido mām̐ṭalāḍave
mŏgamĕtti lāliṁchi mudduḍuṁgaramu vĕṭṭī
tagu nīsannulu som̐ka daṁḍane kūsuṁḍave
(||yĕna||)
sedimīm̐dam̐ jeyivesi sĕppī nīgum̐ briyamulu
nādiro nīvidanido navvu navvave
kādarānam̐ gālu dŏkki kapparamu nīgu nichchī
ādumārām̐ gām̐giliṁchi yāsa līḍeriṁchave
(||yĕna||)
pŏlayaluga derisi pŏttugu ninnu pilisī
sĕliyaro yidanidom̐ jĕlarem̐gave
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍinnaḍānu ninnu nelĕ
talam̐si naṭlāne yīdanido bhogiṁchave