Enasi yaadamdu memu nettumti memi

ఎనసి యాతఁడు మేము నెట్టుంటి మేమి
Language

(॥పల్లవి॥)
ఎనసి యాతఁడు మేము నెట్టుంటి మేమి
చొనిపి నీ కోరికలు చూచుకొనరాదా

(॥ఎన॥)
విచ్చలవిడి నింకాను విన్నపము చేసుకోవే
పచ్చిదేర పతి నొడఁబరచుకోవే
యిచ్చకము చేసి బాసలెల్లా నిప్పించుకోవే
రచ్చలను మావలపు రవ్వసేయవలదు

(॥ఎన॥)
ననుపున నాతనితో నవ్వులిట్టె నవ్వవే
చనవున నీమోవి చవిచూపవే
పెనఁగులాడి నీవు ప్రియములు నెరపవే
మనసులు సోదించి మమ్మొరయనేఁటికి

(॥ఎన॥)
కలసి నీ వాతనిఁ గాఁగిలించుకొనవే
వెలి నుండి నీ యింటివిందు చెప్పవే
అలరి శ్రీవేంకటేశుఁడాతఁ డిట్టె నన్ను నేలె
కలికితనాల మరి కాఁతాళించఁదగదు

(||pallavi||)
ĕnasi yādam̐ḍu memu nĕṭṭuṁṭi memi
sŏnibi nī korigalu sūsugŏnarādā

(||ĕna||)
vichchalaviḍi niṁkānu vinnabamu sesugove
pachchidera padi nŏḍam̐barasugove
yichchagamu sesi bāsalĕllā nippiṁchugove
rachchalanu māvalabu ravvaseyavaladu

(||ĕna||)
nanubuna nādanido navvuliṭṭĕ navvave
sanavuna nīmovi savisūbave
pĕnam̐gulāḍi nīvu priyamulu nĕrabave
manasulu sodiṁchi mammŏrayanem̐ṭigi

(||ĕna||)
kalasi nī vādanim̐ gām̐giliṁchugŏnave
vĕli nuṁḍi nī yiṁṭiviṁdu sĕppave
alari śhrīveṁkaḍeśhum̐ḍādam̐ ḍiṭṭĕ nannu nelĕ
kaligidanāla mari kām̐tāḽiṁcham̐dagadu