ఎనసేటి వేళను యెగ్గులు లే దెవ్వరికి
(॥పల్లవి॥)
ఎనసేటి వేళను యెగ్గులు లే దెవ్వరికి
వొనర నీకు మొక్కితి నోరుచుకోవయ్యా
(॥ఎన॥)
కూడిన మందె మేళాన కొసరి నిన్నేమంటినో
పాడి పంటా లెంచ కెంత పదరితినో
యీడు వెట్టుకొని నీతో నెమ్మెలెంత సేసితినో
వొడక మొక్కే నీకు నొరుచుకోవయ్యా
(॥ఎన॥)
పరపుపైఁ బండి యెంత పాదము దాఁకించితినో
సరసమాడుతా నెంత జింకించితినో
గొరబుసేసి యెప్పడు కొనగోర గీరితినో
వొరిమెతో మొక్కేనీకు నోరుచుకోవయ్యా
(॥ఎన॥)
కడుఁదమితో నెంత కాఁగిట బిగించితినో
పెడరేఁచి రతి నెంత పెనఁగితినో
యెడయక శ్రీవేంకటేశ నన్ను నేలితివి
వొడికాన మొక్కే నీకు నోరుచుకోవయ్యా
(||pallavi||)
ĕnaseḍi veḽanu yĕggulu le dĕvvarigi
vŏnara nīgu mŏkkidi norusugovayyā
(||ĕna||)
kūḍina maṁdĕ meḽāna kŏsari ninnemaṁṭino
pāḍi paṁṭā lĕṁcha kĕṁta padaridino
yīḍu vĕṭṭugŏni nīdo nĕmmĕlĕṁta sesidino
vŏḍaga mŏkke nīgu nŏrusugovayyā
(||ĕna||)
parabubaim̐ baṁḍi yĕṁta pādamu dām̐kiṁchidino
sarasamāḍudā nĕṁta jiṁkiṁchidino
gŏrabusesi yĕppaḍu kŏnagora gīridino
vŏrimĕdo mŏkkenīgu norusugovayyā
(||ĕna||)
kaḍum̐damido nĕṁta kām̐giḍa bigiṁchidino
pĕḍarem̐si radi nĕṁta pĕnam̐gidino
yĕḍayaga śhrīveṁkaḍeśha nannu nelidivi
vŏḍigāna mŏkke nīgu norusugovayyā