ఏనాటి చుట్టరికమో యీపె నీకు
(॥పల్లవి॥)
ఏనాటి చుట్టరికమో యీపె నీకు
నానఁబెట్టీ వలపులు నయముతో నిపుడు
(॥ఏనాటి॥)
మొలకసిగ్గులుతోడ ముసిముసి నవ్వు నవ్వి
కలికి చూపులఁ జూచీ కాంత నిన్ను
పలుకుఁదేనెలు చింద పలుమారు మాఁటలాడి
తలఁపించీఁ దనపొందు తా నెవ్వతోకాని
(॥ఏనాటి॥)
చెదరుఁ గురులతోడ సేఁసకొప్పు గొంత వంచి
కుదురు గుబ్బల నొత్తీ కోమలి నిన్ను
ముదురు గోళ్లచేత మొక్కులు నీకు మొక్కి
యెదుటనే నిలుచునన దెవ్వతోకాని
(॥ఏనాటి॥)
కరఁగుఁ జెమటతోడ కాఁగిట నిన్నుఁ బట్టి
మెరుఁగుఁజెక్కుల మెచ్చీ మెలుఁత నిన్ను
గురిగా శ్రీవేంకటేశ కూచితివి నన్నుఁ దొల్లె
యెరిఁగించీఁ దనరాక ఇదెవ్వతోకాని
(||pallavi||)
enāḍi suṭṭarigamo yībĕ nīgu
nānam̐bĕṭṭī valabulu nayamudo nibuḍu
(||enāḍi||)
mŏlagasigguludoḍa musimusi navvu navvi
kaligi sūbulam̐ jūsī kāṁta ninnu
palugum̐denĕlu siṁda palumāru mām̐ṭalāḍi
talam̐piṁchīm̐ danabŏṁdu tā nĕvvadogāni
(||enāḍi||)
sĕdarum̐ guruladoḍa sem̐sagŏppu gŏṁta vaṁchi
kuduru gubbala nŏttī komali ninnu
muduru goḽlaseda mŏkkulu nīgu mŏkki
yĕduḍane nilusunana dĕvvadogāni
(||enāḍi||)
karam̐gum̐ jĕmaḍadoḍa kām̐giḍa ninnum̐ baṭṭi
mĕrum̐gum̐jĕkkula mĕchchī mĕlum̐ta ninnu
gurigā śhrīveṁkaḍeśha kūsidivi nannum̐ dŏllĕ
yĕrim̐giṁchīm̐ danarāga idĕvvadogāni