Emunna dimdulona yerimgina panule

ఏమున్న దిందులోన యెరిఁగిన పనులె
Language

(॥పల్లవి॥)
ఏమున్న దిందులోన యెరిఁగిన పనులె
కామించి వలెనంటే కరఁగీనా మనసు

(॥ఏము॥)
గుట్టుతో నే నుండఁగానే కోరి తరితీపు గాక
పట్టి పెనఁగఁగఁ బోతే బయలే కాదా
వొట్టుక తెరమరఁగై వుండఁగానే చవి గాక
ముట్టి యెదుట నుండితేమొగచాటు గాదా

(॥ఏము॥)
దవ్వుల నే నుండ గానే దగ్గరి వచ్చేవు గాక
యివ్వల నేఁ బైకొంటే నెరవే కాదా
రవ్వగా నవ్వకుండఁగా రాజస మింతే కాక
నివ్వటిల్లే సరసాలు నేరములే కావా

(॥ఏము॥)
కడు సిగ్గువడఁగానే కాఁగిటఁ గూడేవు గాక
వెడగై నేఁ బదరితే వేసటే కాదా
నడుమ శ్రీవేంకటేశ నన్ను నీవే యేలితివి
బడిబడిఁ దిరిగితే బలుములే కావా

(||pallavi||)
emunna diṁdulona yĕrim̐gina panulĕ
kāmiṁchi valĕnaṁṭe karam̐gīnā manasu

(||emu||)
guṭṭudo ne nuṁḍam̐gāne kori taridību gāga
paṭṭi pĕnam̐gam̐gam̐ bode bayale kādā
vŏṭṭuga tĕramaram̐gai vuṁḍam̐gāne savi gāga
muṭṭi yĕduḍa nuṁḍidemŏgasāḍu gādā

(||emu||)
davvula ne nuṁḍa gāne daggari vachchevu gāga
yivvala nem̐ baigŏṁṭe nĕrave kādā
ravvagā navvaguṁḍam̐gā rājasa miṁte kāga
nivvaḍille sarasālu neramule kāvā

(||emu||)
kaḍu sigguvaḍam̐gāne kām̐giḍam̐ gūḍevu gāga
vĕḍagai nem̐ badaride vesaḍe kādā
naḍuma śhrīveṁkaḍeśha nannu nīve yelidivi
baḍibaḍim̐ dirigide balumule kāvā