ఏఁటివో నీకే తెలుసు నివి యిన్నియు
(॥పల్లవి॥)
ఏఁటివో నీకే తెలుసు నివి యిన్నియు
మాటు లేని నీ గుణాలు మట్టు లేనివె
(॥ఏటి॥)
తేనెలు గారెడిమాట తేరకొన నాడేవు
కానుక వట్టెటిచూపు కడు జల్లేవు
లోనైరినీ కిందుకే లోకములో చెలు లెల్ల
వీనుల నీసుద్దు లైతే వినఁ గొత్తలె
(॥ఏటి॥)
కడు నీవినయుములు కస్తురివంటివె
బడిబడి నీవలపు పాలవంటిదె
విడువరు ని న్నిందుకే వీదివీదిసతు లెల్ల
తడవతే నీవిధాలు తమకించేవే
(॥ఏటి॥)
చెలఁగి నీకూటములు జిగు రయి అంటుకొను
అలరు నీముచ్చటలు ఆనందాలు
కలసితి విదె శ్రీవెంకటగిరీశ్వర నన్ను
బలు నీ మన్ననలు పైపై భాగ్యాలె
(||pallavi||)
em̐ṭivo nīge tĕlusu nivi yinniyu
māḍu leni nī guṇālu maṭṭu lenivĕ
(||eḍi||)
tenĕlu gārĕḍimāḍa teragŏna nāḍevu
kānuga vaṭṭĕḍisūbu kaḍu jallevu
lonairinī kiṁduge logamulo sĕlu lĕlla
vīnula nīsuddu laide vinam̐ gŏttalĕ
(||eḍi||)
kaḍu nīvinayumulu kasturivaṁṭivĕ
baḍibaḍi nīvalabu pālavaṁṭidĕ
viḍuvaru ni nniṁduge vīdivīdisadu lĕlla
taḍavade nīvidhālu tamagiṁcheve
(||eḍi||)
sĕlam̐gi nīgūḍamulu jigu rayi aṁṭugŏnu
alaru nīmuchchaḍalu ānaṁdālu
kalasidi vidĕ śhrīvĕṁkaḍagirīśhvara nannu
balu nī mannanalu paibai bhāgyālĕ