ఏఁటిమాటలాడేవు యెందాఁకనైనా
(॥పల్లవి॥)
ఏఁటిమాటలాడేవు యెందాఁకనైనా
వాఁటమై నిన్నుఁ గాదనేవారు లేరంటానా
(॥ఏటి॥)
చెలుల కిందరికని సిగ్గే మూలధనము
తలవంచుకొనరాదా తరుణికిని
చనివాసినవాఁడవు సారె నీవు నవ్వితేను
మలసి యిల్లాలికి మారు నవ్వఁదగునా
(॥ఏటి॥)
కొమ్మలకునెల్లాను కోపమే సింగారము
బొమ్మల జంకించరాదా పొలఁతికిని
దిమ్మరివాఁడవు నీవు దీకొని సన్న సేసితే
అమ్మరో గరితలకు నాగడాలు దగునా
(॥ఏటి॥)
కోమలులకెల్లాను గుట్టే చక్కఁదనము
నేమముతో నుండరాదా నెలఁతకును
ఆముక శ్రీవేంకటేశ అట్టె నీవు గూడితివి
ప్రేమపుపెండ్లికూఁతుకు పెనఁగఁగఁదగునా
(||pallavi||)
em̐ṭimāḍalāḍevu yĕṁdām̐kanainā
vām̐ṭamai ninnum̐ gādanevāru leraṁṭānā
(||eḍi||)
sĕlula kiṁdarigani sigge mūladhanamu
talavaṁchugŏnarādā taruṇigini
sanivāsinavām̐ḍavu sārĕ nīvu navvidenu
malasi yillāligi māru navvam̐dagunā
(||eḍi||)
kŏmmalagunĕllānu kobame siṁgāramu
bŏmmala jaṁkiṁcharādā pŏlam̐tigini
dimmarivām̐ḍavu nīvu dīgŏni sanna seside
ammaro garidalagu nāgaḍālu dagunā
(||eḍi||)
komalulagĕllānu guṭṭe sakkam̐danamu
nemamudo nuṁḍarādā nĕlam̐tagunu
āmuga śhrīveṁkaḍeśha aṭṭĕ nīvu gūḍidivi
premabubĕṁḍligūm̐tugu pĕnam̐gam̐gam̐dagunā