ఏఁటిమాట లాడేవే యింతటిలోనే
(॥పల్లవి॥)
ఏఁటిమాట లాడేవే యింతటిలోనే
యీటుకే గోర గీరితే యేరయ్యీఁ బనులు
(॥ఏఁటిమాట॥)
చివ్వన నలిగే వేలే చెలియా, నే
నెవ్వరితోడ నలిగే యేడ కేడయ్య
దవ్వుగా మాటలాడేవే తగునటవే జోలి
దవ్వుకు నూతిలోనే బేతాళాలు వుట్టీని
(॥ఏఁటిమాట॥)
కన్నీరు నించే వేలే కలికి, నా
కన్నీట నెవ్వరిమతి గరఁగీనయ్యా
వన్నెగా నీ బుద్ది నీ కెవ్వరు చెప్పేరే, నే
బిన్నదాన యీరు దియ్యం బేను వచ్చీఁ జాలును
(॥ఏఁటిమాట॥)
చెక్కుచేయి యింకా నేలే చెలియా
చెక్కులపై నీవు సేసే సేఁతల కయ్యా
గుక్కక శ్రీవేంకటాద్రిఁ గూడితిఁ గదే
మక్కువల మయిల దీర మణుఁ గాయఁ జాలును
(||pallavi||)
em̐ṭimāḍa lāḍeve yiṁtaḍilone
yīḍuge gora gīride yerayyīm̐ banulu
(||em̐ṭimāḍa||)
sivvana nalige vele sĕliyā, ne
nĕvvaridoḍa nalige yeḍa keḍayya
davvugā māḍalāḍeve tagunaḍave joli
davvugu nūdilone bedāḽālu vuṭṭīni
(||em̐ṭimāḍa||)
kannīru niṁche vele kaligi, nā
kannīḍa nĕvvarimadi garam̐gīnayyā
vannĕgā nī buddi nī kĕvvaru sĕppere, ne
binnadāna yīru diyyaṁ benu vachchīm̐ jālunu
(||em̐ṭimāḍa||)
sĕkkuseyi yiṁkā nele sĕliyā
sĕkkulabai nīvu sese sem̐tala kayyā
gukkaga śhrīveṁkaḍādrim̐ gūḍidim̐ gade
makkuvala mayila dīra maṇum̐ gāyam̐ jālunu