Emtijoli segomtivi yemta viraali

ఏఁటిజోలి చేకొంటివి యెంత విరాళి
Language

(॥పల్లవి॥)
ఏఁటిజోలి చేకొంటివి యెంత విరాళి
నీటున నింతికడకు నేఁడే రారాదా

(॥ఏటి॥)
కలికికన్నులచూపు కడలేని తరితీపు
మొలకచన్నులు నీవు మోఁచేటిమోపు
తెలిసిచూడ వలపు తెగరానిరారాఁపు
కలిగె నింతికడకు గక్కన రారాదా

(॥ఏటి॥)
వనిత చిగురుమోవి వన్నెలైనచెంగావి
దినదినమును నీకు తియ్యనితావి
చెనకి మీయిద్దరికిఁ జెప్పితి నే నిండువావి
యెనసె నింతకడకు నిప్పుడే రారాదా

(॥ఏటి॥)
అలమేలుమంగ మాఁట అమరుఁ గోవిలపాట
కలయికలకు నిదె కాఁగిటిపూఁట
యెలమి శ్రీవేంకటేశ యీకెఁ గూడితి విచ్చోట
తలచి యింతికడకుఁ దప్పక రారాదా

(||pallavi||)
em̐ṭijoli segŏṁṭivi yĕṁta virāḽi
nīḍuna niṁtigaḍagu nem̐ḍe rārādā

(||eḍi||)
kaligigannulasūbu kaḍaleni taridību
mŏlagasannulu nīvu mom̐seḍimobu
tĕlisisūḍa valabu tĕgarānirārām̐pu
kaligĕ niṁtigaḍagu gakkana rārādā

(||eḍi||)
vanida sigurumovi vannĕlainasĕṁgāvi
dinadinamunu nīgu tiyyanidāvi
sĕnagi mīyiddarigim̐ jĕppidi ne niṁḍuvāvi
yĕnasĕ niṁtagaḍagu nippuḍe rārādā

(||eḍi||)
alamelumaṁga mām̐ṭa amarum̐ govilabāḍa
kalayigalagu nidĕ kām̐giḍibūm̐ṭa
yĕlami śhrīveṁkaḍeśha yīgĕm̐ gūḍidi vichchoḍa
talasi yiṁtigaḍagum̐ dappaga rārādā