Emtigim jimtimchevu yeṟamgavaa naa manasu

ఏఁటికిఁ జింతించేవు యెఱఁగవా నా మనసు
Language

(॥పల్లవి॥)
ఏఁటికిఁ జింతించేవు యెఱఁగవా నా మనసు
చీటికిమాటికి లోలో సిగ్గులు నా సాజము

(॥॥)
మొగమోటగలదాన ముందుముందే దూరనేర
నగుతానుండేదిది నాసాజము
తగవు దప్పనిదాన తబ్బిబ్బులకు నోపను
అగపడి మెచ్చు మెచ్చే దదియు నాపాజము

(॥॥)
వినయముగలదాన వెంగెములాడఁగనేర
ననిచి మాటలాడేది నాసాజము
మనసు నమ్మినదాన మర్మము లెత్తఁగ నోప
చనవులు మెరసేది చక్కనినాసాజము

(॥॥)
కడు బత్తిగలదాన కాఁతాళించుకొననేర
నడుమఁ గాఁగిలించేది నాసాజము
అడరి నన్నేలితివి అంతలో శ్రీ వేంకటేశ
యెడసి పాయఁగనోప యిదే నాసాజము

(||pallavi||)
em̐ṭigim̐ jiṁtiṁchevu yĕṟam̐gavā nā manasu
sīḍigimāḍigi lolo siggulu nā sājamu

(||||)
mŏgamoḍagaladāna muṁdumuṁde dūranera
nagudānuṁḍedidi nāsājamu
tagavu dappanidāna tabbibbulagu nobanu
agabaḍi mĕchchu mĕchche dadiyu nābājamu

(||||)
vinayamugaladāna vĕṁgĕmulāḍam̐ganera
nanisi māḍalāḍedi nāsājamu
manasu namminadāna marmamu lĕttam̐ga noba
sanavulu mĕrasedi sakkanināsājamu

(||||)
kaḍu battigaladāna kām̐tāḽiṁchugŏnanera
naḍumam̐ gām̐giliṁchedi nāsājamu
aḍari nannelidivi aṁtalo śhrī veṁkaḍeśha
yĕḍasi pāyam̐ganoba yide nāsājamu