Emtigim jesevu baasa lela pettevaanalu

ఏఁటికిఁ జేసేవు బాస లేల పెట్టేవానలు
Language

(॥పల్లవి॥)
ఏఁటికిఁ జేసేవు బాస లేల పెట్టేవానలు
నేఁటివలె నుంటేను నీవే మంచివాఁడవు

(॥ఏఁటి॥)
మగువపట్టుకు నీవు మనసున వాకునఁ
దగవు నడపితేనే తప్పు లేదు
అగపడి యాపెమాట కట్టే లోనై నడచితే
నిగిడి యెన్నటికి నీవే మంచివాఁడవు

(॥ఏఁటి॥)
వనితకు నీవూరకే వద్దఁ గాచుకుండితేను
తనసొమ్మైనట్టే నీకు తప్పులేదు
యెనసి యాపెచనవు లింతటానుఁ జెల్లించితే
నినుపు జాణతనాన నీవే మంచివాఁడవు

(॥ఏఁటి॥)
వెలఁదికాఁగిట నీకు వేరే చింత లేకుండితే
తలఁపులోపల మరి తప్పులేదు
యెలమి శ్రీవేంకటేశ యీకె నిట్టె కగూడితివి
నిలువెల్లా వలపులే నీవే మంచివాఁడవు

(||pallavi||)
em̐ṭigim̐ jesevu bāsa lela pĕṭṭevānalu
nem̐ṭivalĕ nuṁṭenu nīve maṁchivām̐ḍavu

(||em̐ṭi||)
maguvabaṭṭugu nīvu manasuna vāgunam̐
dagavu naḍabidene tappu ledu
agabaḍi yābĕmāḍa kaṭṭe lonai naḍaside
nigiḍi yĕnnaḍigi nīve maṁchivām̐ḍavu

(||em̐ṭi||)
vanidagu nīvūrage vaddam̐ gāsuguṁḍidenu
tanasŏmmainaṭṭe nīgu tappuledu
yĕnasi yābĕsanavu liṁtaḍānum̐ jĕlliṁchide
ninubu jāṇadanāna nīve maṁchivām̐ḍavu

(||em̐ṭi||)
vĕlam̐digām̐giḍa nīgu vere siṁta leguṁḍide
talam̐pulobala mari tappuledu
yĕlami śhrīveṁkaḍeśha yīgĕ niṭṭĕ kagūḍidivi
niluvĕllā valabule nīve maṁchivām̐ḍavu