ఏఁటికిఁ గన్నులు మూసే వెరఁగనివానివలె
(॥పల్లవి॥)
ఏఁటికిఁ గన్నులు మూసే వెరఁగనివానివలె
నాటకపు మిమ్ముఁ జూచి నాకిది తెలిసెను
(॥ఏఁటి॥)
కుంచ నీకు వేయఁగాను కొప్పుపువ్వులెల్ల రాలె
నించినతమకమున నీమీఁదను
చుంచులదానివుపరిసురతవేళ రాలిన
చంచువలె నుండె నని సతి లోలో నవ్వెను
(॥ఏఁటి॥)
పల్లకి యెక్కించఁగాను పడఁతి వెనక ముందై
జల్లనఁ బులకించె నీరసానకు
పల్లదాన నలిగితే బలిమి నీవు గూడేటిఁ
వల్లడిరతి దలఁచి వడి లోలో నవ్వెను
(॥ఏఁటి॥)
సంగడి నిలుచుండఁగ చను మెన నిన్నుఁ దాఁకె
ముంగిట శ్రీ వేంకటేశ మోము తోడ
ఆంగవించి కూడితివి ఆపె నట్టె కాఁగిటను
అంగపునానావిధాల కటు లోలో నవ్వెను
(||pallavi||)
em̐ṭigim̐ gannulu mūse vĕram̐ganivānivalĕ
nāḍagabu mimmum̐ jūsi nāgidi tĕlisĕnu
(||em̐ṭi||)
kuṁcha nīgu veyam̐gānu kŏppubuvvulĕlla rālĕ
niṁchinadamagamuna nīmīm̐danu
suṁchuladānivubarisuradaveḽa rālina
saṁchuvalĕ nuṁḍĕ nani sadi lolo navvĕnu
(||em̐ṭi||)
pallagi yĕkkiṁcham̐gānu paḍam̐ti vĕnaga muṁdai
jallanam̐ bulagiṁchĕ nīrasānagu
palladāna naligide balimi nīvu gūḍeḍim̐
vallaḍiradi dalam̐si vaḍi lolo navvĕnu
(||em̐ṭi||)
saṁgaḍi nilusuṁḍam̐ga sanu mĕna ninnum̐ dām̐kĕ
muṁgiḍa śhrī veṁkaḍeśha momu toḍa
āṁgaviṁchi kūḍidivi ābĕ naṭṭĕ kām̐giḍanu
aṁgabunānāvidhāla kaḍu lolo navvĕnu