ఏఁటికిఁ గాచుకున్నదో యెఱుఁగుదము
(॥పల్లవి॥)
ఏఁటికిఁ గాచుకున్నదో యెఱుఁగుదము
కోటి శాయఁ గానుకిచ్చి గుట్టుతోడ నున్నది
(॥ఏఁటి॥)
చెలియ విన్నపములు సేయ వచ్చి వున్నదేమో
తిలకించి నీ వడిగి తెలియరాదా
నెలకొని నిన్నుఁజూచి నివ్వెరగై వున్నదేమో
తలకొన గోర నూఁది తలపించరాదా
(॥ఏఁటి॥)
యెంతవని గలిగి తానిటు వచ్చి వున్నదో
వింతలుగ లాలించి వినఁగరాదా
చింతతోడఁ జెప్పరాక సిగ్గువడి వున్నదేమో
మంతనానకుఁ దీసి మర్మము లంటరాదా
(॥ఏఁటి॥)
వెస నేమి యాసపడి వేళ గాచుకున్నదో
పొఁగ నాపెఁ దనినిఁ బొందించరాదా
యెఁగ శ్రీవేంకటేశ యిట్టె నన్ను నేలితివి
సుసరాన నాపెఁ గూడి చొక్కించరాదా
(||pallavi||)
em̐ṭigim̐ gāsugunnado yĕṟum̐gudamu
koḍi śhāyam̐ gānugichchi guṭṭudoḍa nunnadi
(||em̐ṭi||)
sĕliya vinnabamulu seya vachchi vunnademo
tilagiṁchi nī vaḍigi tĕliyarādā
nĕlagŏni ninnum̐jūsi nivvĕragai vunnademo
talagŏna gora nūm̐di talabiṁcharādā
(||em̐ṭi||)
yĕṁtavani galigi tāniḍu vachchi vunnado
viṁtaluga lāliṁchi vinam̐garādā
siṁtadoḍam̐ jĕpparāga sigguvaḍi vunnademo
maṁtanānagum̐ dīsi marmamu laṁṭarādā
(||em̐ṭi||)
vĕsa nemi yāsabaḍi veḽa gāsugunnado
pŏm̐ga nābĕm̐ daninim̐ bŏṁdiṁcharādā
yĕm̐ga śhrīveṁkaḍeśha yiṭṭĕ nannu nelidivi
susarāna nābĕm̐ gūḍi sŏkkiṁcharādā