Emtigim damagimchevu yimtalonane

ఏఁటికిఁ దమకించేవు యింతలోననే
Language

(॥పల్లవి॥)
ఏఁటికిఁ దమకించేవు యింతలోననే
ఆఁటదాని కిట్టె వసమయి వుండవయ్యా

(॥॥)
సిగ్గుతోడనున్నచెలిఁ జేయివట్టి పెనఁగుచు-
నగ్గలపువేడుకతో నలయింతురా
వొగ్గి విడెమిచ్చి మరి వొడఁబరచి మెల్లనె
యెగ్గుసేయక నీ వీపెయిచ్చలో రావయ్యా

(॥॥)
గుట్టుతోడనున్న యింతిఁ గొలువులోఁ జెనకుచు
తొట్టినమదముతోడ దొమ్మిసేతురా
మట్టుతోనే మోవి చూపి మన్ననలు పచరించి
బట్టబయ లీఁదించక పనుపు సేయవయ్యా

(॥॥)
మేలుతోనున్నకాంతను మేకొని వచ్చి మన్నించి
యీలీలఁ గూడినవాఁడ వెమ్మెసేతురా
తాలిమితో బుజ్జగించి తనిపి శ్రీవేంకటేశ
యేలుకొంటి వెడయక యింట నుండవయ్యా

(||pallavi||)
em̐ṭigim̐ damagiṁchevu yiṁtalonane
ām̐ṭadāni kiṭṭĕ vasamayi vuṁḍavayyā

(||||)
siggudoḍanunnasĕlim̐ jeyivaṭṭi pĕnam̐gusu-
naggalabuveḍugado nalayiṁturā
vŏggi viḍĕmichchi mari vŏḍam̐barasi mĕllanĕ
yĕgguseyaga nī vībĕyichchalo rāvayyā

(||||)
guṭṭudoḍanunna yiṁtim̐ gŏluvulom̐ jĕnagusu
tŏṭṭinamadamudoḍa dŏmmisedurā
maṭṭudone movi sūbi mannanalu pasariṁchi
baṭṭabaya līm̐diṁchaga panubu seyavayyā

(||||)
meludonunnagāṁtanu megŏni vachchi manniṁchi
yīlīlam̐ gūḍinavām̐ḍa vĕmmĕsedurā
tālimido bujjagiṁchi tanibi śhrīveṁkaḍeśha
yelugŏṁṭi vĕḍayaga yiṁṭa nuṁḍavayyā