Emtigim damagimche vela pette vaanalellaa

ఏఁటికిఁ దమకించే వేల పెట్టే వానలెల్లా
Language

(॥పల్లవి॥)
ఏఁటికిఁ దమకించే వేల పెట్టే వానలెల్లా
నీటుతోనే వుండరాదా నిజమయ్యీఁ గాని

(॥ఏటి॥)
యిందరిలో రంతులేల యింటికి విచ్చేయరాదా
చెంది నీతో నొకమాట చెప్పేఁగాని
విందువలె నాచేతివిడె మందుకోరాదా
కందువ మీఁదటిసుద్ది గనేవు గాని

(॥ఏటి॥)
పాసివుండక పానుపుపైఁ బవళించరాదా
రాసికెక్క నీచిత్తము రప్పించేఁగాని
పోసరించి నామోవిపొత్తు గలయఁగరాదా
ఆసల నీపనికి సహాయమయ్యేగాని

(॥ఏటి॥)
పక్కన నిట్టె నీపచ్చడము గప్పరాదా
నిక్కము నానేరుపులు నెరపేఁగాని
యిక్కడ శ్రీవేంకటేశ యెనసితి మిద్దరము
చెక్కునొక్క నియ్యరాదా సేసవెట్టేఁగాని

(||pallavi||)
em̐ṭigim̐ damagiṁche vela pĕṭṭe vānalĕllā
nīḍudone vuṁḍarādā nijamayyīm̐ gāni

(||eḍi||)
yiṁdarilo raṁtulela yiṁṭigi vichcheyarādā
sĕṁdi nīdo nŏgamāḍa sĕppem̐gāni
viṁduvalĕ nāsediviḍĕ maṁdugorādā
kaṁduva mīm̐daḍisuddi ganevu gāni

(||eḍi||)
pāsivuṁḍaga pānububaim̐ bavaḽiṁcharādā
rāsigĕkka nīsittamu rappiṁchem̐gāni
posariṁchi nāmovibŏttu galayam̐garādā
āsala nībanigi sahāyamayyegāni

(||eḍi||)
pakkana niṭṭĕ nībachchaḍamu gapparādā
nikkamu nānerubulu nĕrabem̐gāni
yikkaḍa śhrīveṁkaḍeśha yĕnasidi middaramu
sĕkkunŏkka niyyarādā sesavĕṭṭem̐gāni