ఏఁటికిఁ దలవంచేవు యెందాఁకను
(॥పల్లవి॥)
ఏఁటికిఁ దలవంచేవు యెందాఁకను
కాటుకకన్నులను గక్కుననుఁ జూడవే
(॥ఏఁటి॥)
మొయిలువంటివయసు ముడియగట్టఁగరాదా
నయముగ బుద్దిచెప్ప నావసమా
బయలు వందిలివెట్టి పంతములేలాడేవు
క్రియగూడ పతితోను కెలయుచు నగవే
(॥ఏఁటి॥)
వెన్నెలవంటి వేడుక వెస గాదెఁ బోయరాదు
ఇన్నిటా జాణవు నీవే యెఱఁగవటే
చన్నుల మెఱుఁగుచూపి చవులేల కొలిపేవు
యెన్నికకెక్కె నితని ఇంపులు చేకొనవే
(॥ఏఁటి॥)
కొండవంటిది వయసు గుదిగొని తోయరాదు
గండుమీఱి యేలపొద్దు గడుపేవే
అండనే శ్రీ వెంకటేశుఁడాయాలంటి నిన్నుఁగూడె
నిండు యీతనివోజకు నీవు మెచ్చఁగదవే
(||pallavi||)
em̐ṭigim̐ dalavaṁchevu yĕṁdām̐kanu
kāḍugagannulanu gakkunanum̐ jūḍave
(||em̐ṭi||)
mŏyiluvaṁṭivayasu muḍiyagaṭṭam̐garādā
nayamuga buddisĕppa nāvasamā
bayalu vaṁdilivĕṭṭi paṁtamulelāḍevu
kriyagūḍa padidonu kĕlayusu nagave
(||em̐ṭi||)
vĕnnĕlavaṁṭi veḍuga vĕsa gādĕm̐ boyarādu
inniḍā jāṇavu nīve yĕṟam̐gavaḍe
sannula mĕṟum̐gusūbi savulela kŏlibevu
yĕnnigagĕkkĕ nidani iṁpulu segŏnave
(||em̐ṭi||)
kŏṁḍavaṁṭidi vayasu gudigŏni toyarādu
gaṁḍumīṟi yelabŏddu gaḍubeve
aṁḍane śhrī vĕṁkaḍeśhum̐ḍāyālaṁṭi ninnum̐gūḍĕ
niṁḍu yīdanivojagu nīvu mĕchcham̐gadave