ఏఁటికిఁ బొడిఁబడేవు ఇంత మనికితముతో
(॥పల్లవి॥)
ఏఁటికిఁ బొడిఁబడేవు ఇంత మనికితముతో
సూటిగా వినేవారు చూచి ఇట్టె నవ్వరా
(॥ఏటి॥)
కలలో నెవ్వతో నిన్నుఁ గాఁగిలించుకొనెనంటా
వెలయ మాతోం జెప్పేవు వేసాలకు
కలికపై వల పింత గలిగినవాఁడవు
తొలుతె కాళ్లకు మొక్కి తోడి తెచ్చుకోరాదా
(॥ఏటి॥)
తరుణి యెవ్వతో నీ తలఁపునఁ బారెనంటా
కెరలి మాతోఁ జెప్పేవు కేరడాలకు
మరిగి యాపెమీఁదను మచ్చిక గలవాఁడవు
ఇరవుగా బాస ఇచ్చి ఇంటఁబెట్టుకోరాదా
(॥ఏటి॥)
దేవులు యెవ్వతో నేడు దిష్టముగాఁ గూడెనంటా
శ్రీవేంకటేశుఁడ నన్నుఁ జేరి కూడేవు
తావున నాపెపై నింత తగులుగలవాఁడవు
కావరాన నాపె మెడఁగట్టుకొనరాదు
(||pallavi||)
em̐ṭigim̐ bŏḍim̐baḍevu iṁta manigidamudo
sūḍigā vinevāru sūsi iṭṭĕ navvarā
(||eḍi||)
kalalo nĕvvado ninnum̐ gām̐giliṁchugŏnĕnaṁṭā
vĕlaya mādoṁ jĕppevu vesālagu
kaligabai vala piṁta galiginavām̐ḍavu
tŏludĕ kāḽlagu mŏkki toḍi tĕchchugorādā
(||eḍi||)
taruṇi yĕvvado nī talam̐punam̐ bārĕnaṁṭā
kĕrali mādom̐ jĕppevu keraḍālagu
marigi yābĕmīm̐danu machchiga galavām̐ḍavu
iravugā bāsa ichchi iṁṭam̐bĕṭṭugorādā
(||eḍi||)
devulu yĕvvado neḍu diṣhṭamugām̐ gūḍĕnaṁṭā
śhrīveṁkaḍeśhum̐ḍa nannum̐ jeri kūḍevu
tāvuna nābĕbai niṁta tagulugalavām̐ḍavu
kāvarāna nābĕ mĕḍam̐gaṭṭugŏnarādu