Emtigim baraagu sese vekkada soosevu neevu

ఏఁటికిఁ బరాకు సేసే వెక్కడ చూచెవు నీవు
Language

(॥పల్లవి॥)
ఏఁటికిఁ బరాకు సేసే వెక్కడ చూచెవు నీవు
ఆఁటదాని నంతేసి అలయించకువయ్యా

(॥ఏఁటికి॥)
మోవితేనె గారఁగాను ముందరనే నిలుచుండి
వావులు దెలుపుకొనీ వనిత నీతో
దేవులా యిది నీకు తెలియ యెన్నఁడు నేము
వోవరిలో సంగతిఁ గూచుండఁ బెట్టుకోవయ్యా

(॥ఏఁటికి॥)
సెలవి నవ్వులు చింద చేత నీకు విడెమిచ్చి
చెలుములు సేసీని చెలియ నీతో
నెలకొన్న ప్రియురాలా నేఁడు నేము చూచితిమి
కలతువు గాని ఇట్టె కౌఁగిలించుకోవయ్యా

(॥ఏఁటికి॥)
ఘనకుచములకాంతి కడు నీపైఁ దొలఁకఁగా
వినయానఁ బెనఁగీని వెలఁది నీతో
యెనసితి విటు నన్ను యీకె నీకొకతె గద్దా
వొనర శ్రీవేంకటేశ వొప్పుకొనవయ్యా

(||pallavi||)
em̐ṭigim̐ barāgu sese vĕkkaḍa sūsĕvu nīvu
ām̐ṭadāni naṁtesi alayiṁchaguvayyā

(||em̐ṭigi||)
movidenĕ gāram̐gānu muṁdarane nilusuṁḍi
vāvulu dĕlubugŏnī vanida nīdo
devulā yidi nīgu tĕliya yĕnnam̐ḍu nemu
vovarilo saṁgadim̐ gūsuṁḍam̐ bĕṭṭugovayyā

(||em̐ṭigi||)
sĕlavi navvulu siṁda seda nīgu viḍĕmichchi
sĕlumulu sesīni sĕliya nīdo
nĕlagŏnna priyurālā nem̐ḍu nemu sūsidimi
kaladuvu gāni iṭṭĕ kaum̐giliṁchugovayyā

(||em̐ṭigi||)
ghanagusamulagāṁti kaḍu nībaim̐ dŏlam̐kam̐gā
vinayānam̐ bĕnam̐gīni vĕlam̐di nīdo
yĕnasidi viḍu nannu yīgĕ nīgŏgadĕ gaddā
vŏnara śhrīveṁkaḍeśha vŏppugŏnavayyā