ఏఁటికిఁ బంతాలు చూపే వింతితోను
(॥పల్లవి॥)
ఏఁటికిఁ బంతాలు చూపే వింతితోను
ఆఁటదాని పలుకులు ఆదరించరాదా
(॥ఏఁటికి॥)
బింకా లాడవచ్చుఁ గాని పెనఁగుచు వనితల
మంకులు దేర్చఁగ రాదు మగవానికి
బొంకు లాడవచ్చుఁగాని పొదిగి యానవెట్టితే
పొంకానకుఁ దేరాదు పొసఁగనిమాట
(॥ఏఁటికి॥)
యెగ్గు లెంచవచ్చుఁ గాని యెంతైనా జవరాండ్ల
సిగ్గులు దేరుచరాదు చెలువునికి
వెగ్గలించవచ్చుఁ గాని వేసటవుట్టినవేళ
వొగ్గి కొనవేయరాదు వొఱ్ఱబాగుగుణము
(॥ఏఁటికి॥)
బాస లియ్యవచ్చుఁగాని పైకొని రతిఁ గూడితే
ఆస మానుపరాదు అతివలకు
సేసతో నలమేల్మంగ శ్రీవేంకటేశ కూడె
వ్రాసి చూపరాదు లోలో వలపు లిద్దరికి
(||pallavi||)
em̐ṭigim̐ baṁtālu sūbe viṁtidonu
ām̐ṭadāni palugulu ādariṁcharādā
(||em̐ṭigi||)
biṁkā lāḍavachchum̐ gāni pĕnam̐gusu vanidala
maṁkulu dersam̐ga rādu magavānigi
bŏṁku lāḍavachchum̐gāni pŏdigi yānavĕṭṭide
pŏṁkānagum̐ derādu pŏsam̐ganimāḍa
(||em̐ṭigi||)
yĕggu lĕṁchavachchum̐ gāni yĕṁtainā javarāṁḍla
siggulu derusarādu sĕluvunigi
vĕggaliṁchavachchum̐ gāni vesaḍavuṭṭinaveḽa
vŏggi kŏnaveyarādu vŏṭrabāguguṇamu
(||em̐ṭigi||)
bāsa liyyavachchum̐gāni paigŏni radim̐ gūḍide
āsa mānubarādu adivalagu
sesado nalamelmaṁga śhrīveṁkaḍeśha kūḍĕ
vrāsi sūbarādu lolo valabu liddarigi