ఏఁటికి యెక్కినవాని కేనిగె గుజ్జౌనొ కాదో
(॥పల్లవి॥)
ఏఁటికి యెక్కినవాని కేనిగె గుజ్జౌనొ కాదో
మేఁటి తన పంతమెల్ల మీఁదాయఁ జాలదా
(॥ఏంటి॥)
చేసినచేఁతలు గాక చెలువుఁ డందుకుఁదోడు
మాసియు మాయనియట్టిమాయలుఁ గొన్నా
మోసము నాదేకాదా మొన్న నలిగినదాన
వాసితో నుండకుండితే వచ్చుఁబో నేరములు
(॥ఏంటి॥)
దయమాలి తా రాక తాపమురేఁచుటగాక
నయగారితనముల నవ్వులుఁ గొన్నా
క్రియ నే నెఱఁగఁగాక కిమ్ముల నే నుండఁగాను
ప్రియము చెప్పఁగఁబోతే బిగియక మానునా
(॥ఏంటి॥)
అలసి సొలసి కామెరాఁక లాఁగుతాఁ గాక
కలసిరతివేళ కతలుఁ గొన్నా
యెలమి శ్రీ వేంకటేశు నిట్టె కూడినదాన
వులవచ్చి సేయకుంటే వొరయఁగఁజెల్లదా
(||pallavi||)
em̐ṭigi yĕkkinavāni kenigĕ gujjaunŏ kādo
mem̐ṭi tana paṁtamĕlla mīm̐dāyam̐ jāladā
(||eṁṭi||)
sesinasem̐talu gāga sĕluvum̐ ḍaṁdugum̐doḍu
māsiyu māyaniyaṭṭimāyalum̐ gŏnnā
mosamu nādegādā mŏnna naliginadāna
vāsido nuṁḍaguṁḍide vachchum̐bo neramulu
(||eṁṭi||)
dayamāli tā rāga tābamurem̐suḍagāga
nayagāridanamula navvulum̐ gŏnnā
kriya ne nĕṟam̐gam̐gāga kimmula ne nuṁḍam̐gānu
priyamu sĕppam̐gam̐bode bigiyaga mānunā
(||eṁṭi||)
alasi sŏlasi kāmĕrām̐ka lām̐gudām̐ gāga
kalasiradiveḽa kadalum̐ gŏnnā
yĕlami śhrī veṁkaḍeśhu niṭṭĕ kūḍinadāna
vulavachchi seyaguṁṭe vŏrayam̐gam̐jĕlladā