(॥పల్లవి॥)
ఏఁటికి విచారమిఁక నాకు
కూటములే నను గురిసేసీని
(॥ఏఁటి॥)
యేపున నేనేమి నెఱఁగకుండినా
నీపయి తలఁపులు నేర్పీని
మాపుదాఁక మైమఱచివుండినా
దాపగు వలపులు తలపించీని
(॥ఏఁటి॥)
అసురుసురయి నేనటు కనుచొక్కిన
కొసరి కలలు మేల్కొలిపీని
ముసరుసిగ్గులె మోనాననుండిన
పస నీపదములె పాడించీని
(॥ఏఁటి॥)
అలమితి రతి నేనలసినాను నీ
తెలిమోవి దప్పిదేర్చీని
యెలిమిని శ్రీవెంకటేశ నాకడమ
గలిగినా నీదయగాచీ నన్నును
(||pallavi||)
em̐ṭigi visāramim̐ka nāgu
kūḍamule nanu gurisesīni
(||em̐ṭi||)
yebuna nenemi nĕṟam̐gaguṁḍinā
nībayi talam̐pulu nerbīni
mābudām̐ka maimaṟasivuṁḍinā
dābagu valabulu talabiṁchīni
(||em̐ṭi||)
asurusurayi nenaḍu kanusŏkkina
kŏsari kalalu melgŏlibīni
musarusiggulĕ monānanuṁḍina
pasa nībadamulĕ pāḍiṁchīni
(||em̐ṭi||)
alamidi radi nenalasinānu nī
tĕlimovi dappidersīni
yĕlimini śhrīvĕṁkaḍeśha nāgaḍama
galiginā nīdayagāsī nannunu