Emtigi vesaalu sese vemdaamkaanu

ఏఁటికి వేసాలు సేసే వెందాఁకాను
Language

(॥పల్లవి॥)
ఏఁటికి వేసాలు సేసే వెందాఁకాను
ఆఁటదాని దయఁజూచి యాదరించరాదా

(॥ఏఁటి॥)
రతికి వేడుకపడి రమణి వద్దనుండఁగా
కతలేమిచేప్పేవు జాగరముగాను
యితవుగాకుంటే నానతియ్యరాదా వొకమాట
చతురత నాడీఁగాని చదరంగమైనను

(॥ఏఁటి॥)
జవ్వని మోవితేనె సారెసారె నడుగఁగ
నవ్వలేమి నవ్వేవు నాఁటకానను
చివ్వన నీవియ్యనంటే త వా(వ్రా?) సి చూపరాదా
తవ్వి వానగుంతలైనా తా నాడీఁగాని

(॥ఏఁటి॥)
చక్కనింతి గాఁగిలించి చన్నుల వొన్నిత్తఁగాను
మొక్కులేమిమొక్కేవే మోపులుగాను
ఇక్కువ శ్రీవేంకటేశ యేలితి పందెమీరాదా
పక్కన నాడీఁగాని పగడసాలైనను

(||pallavi||)
em̐ṭigi vesālu sese vĕṁdām̐kānu
ām̐ṭadāni dayam̐jūsi yādariṁcharādā

(||em̐ṭi||)
radigi veḍugabaḍi ramaṇi vaddanuṁḍam̐gā
kadalemiseppevu jāgaramugānu
yidavugāguṁṭe nānadiyyarādā vŏgamāḍa
sadurada nāḍīm̐gāni sadaraṁgamainanu

(||em̐ṭi||)
javvani movidenĕ sārĕsārĕ naḍugam̐ga
navvalemi navvevu nām̐ṭagānanu
sivvana nīviyyanaṁṭe ta vā(vrā?) si sūbarādā
tavvi vānaguṁtalainā tā nāḍīm̐gāni

(||em̐ṭi||)
sakkaniṁti gām̐giliṁchi sannula vŏnnittam̐gānu
mŏkkulemimŏkkeve mobulugānu
ikkuva śhrīveṁkaḍeśha yelidi paṁdĕmīrādā
pakkana nāḍīm̐gāni pagaḍasālainanu