Emtigi veravanela yimdugumgaa ne neegu

ఏఁటికి వెరవనేల యిందుకుఁగా నే నీకు
Language

(॥పల్లవి॥)
ఏఁటికి వెరవనేల యిందుకుఁగా నే నీకు
సూటిగా తప్పక నీవు చూతువు గాక

(॥ఏటి॥)
చలము నీకు జెల్లితే సాదించ నాకుఁ జెల్లదా నీ-
చలమి రాజ్యమేలితే ఏలుదు గాక
బలిమి నీకుఁ జెల్లితే పంతము నాకుఁ జెల్లదా
కులి కెంతగొపించిన కోపింతుగాక

(॥ఏటి॥)
గుట్టు నీకింత చెల్లితే గుంపించ నాకుఁ జెల్లదా
జట్టిగాఁ బగచాటితే చాటుదుగాక
తిట్ట నీకు జెల్లితేను తెగువ నాకుఁ జెల్లదా
పట్టి యెగ్గు నీవెంతైనాఁ బట్టుదుగాక

(॥ఏటి॥)
నయము నీవాడితేను నగ నాకుఁ జెల్లదా
బయలుబందె వట్టితేఁ బట్టుదు గాక
ప్రియమై శ్రీవేంకటేశ బెనఁగి నన్నుఁ గూడితి
క్రియతో కళరేఁచితే రేఁతువుగాక

(||pallavi||)
em̐ṭigi vĕravanela yiṁdugum̐gā ne nīgu
sūḍigā tappaga nīvu sūduvu gāga

(||eḍi||)
salamu nīgu jĕllide sādiṁcha nāgum̐ jĕlladā nī-
salami rājyamelide eludu gāga
balimi nīgum̐ jĕllide paṁtamu nāgum̐ jĕlladā
kuli kĕṁtagŏbiṁchina kobiṁtugāga

(||eḍi||)
guṭṭu nīgiṁta sĕllide guṁpiṁcha nāgum̐ jĕlladā
jaṭṭigām̐ bagasāḍide sāḍudugāga
tiṭṭa nīgu jĕllidenu tĕguva nāgum̐ jĕlladā
paṭṭi yĕggu nīvĕṁtainām̐ baṭṭudugāga

(||eḍi||)
nayamu nīvāḍidenu naga nāgum̐ jĕlladā
bayalubaṁdĕ vaṭṭidem̐ baṭṭudu gāga
priyamai śhrīveṁkaḍeśha bĕnam̐gi nannum̐ gūḍidi
kriyado kaḽarem̐side rem̐tuvugāga