ఏఁటికి వేగిరించేరేయెఱఁగనిదాననటే
(॥పల్లవి॥)
ఏఁటికి వేగిరించేరేయెఱఁగనిదాననటే
కూటమి గలుగుదాఁకాఁ గొసరరాదు
(॥ఏఁటి॥)
బలువుఁడయినయట్టిపతితోడ సతులకు
చలము సాదించరాదు జింకించరాదు
వలవకతొలుతనేవాడికగాఁబేరుకొని
పిలువఁగ రాదు మరి బిగియారాదు
(॥ఏఁటి॥)
వెక్కసమయినయట్టివేడుక కాని నంత
కక్కసించరాదు మతి కరఁచారాదు
నిక్కిచూడకుండఁగాను నేరుపులు వచరించి
పెక్కుమాట లాడరాదు పెనఁగారాదు
(॥ఏఁటి॥)
చేతికిలోనైనయట్టి శ్రీవేంకటేశ్వరుని
కాతరించరాదు మరి కాదనారాదు
యీతఁడే నన్నిటు గూడి ఇచ్చకుఁడై వుండఁగాను
యేతులు నెరపరాదు యెలఇంచారాదు
(||pallavi||)
em̐ṭigi vegiriṁchereyĕṟam̐ganidānanaḍe
kūḍami galugudām̐kām̐ gŏsararādu
(||em̐ṭi||)
baluvum̐ḍayinayaṭṭibadidoḍa sadulagu
salamu sādiṁcharādu jiṁkiṁcharādu
valavagadŏludanevāḍigagām̐berugŏni
piluvam̐ga rādu mari bigiyārādu
(||em̐ṭi||)
vĕkkasamayinayaṭṭiveḍuga kāni naṁta
kakkasiṁcharādu madi karam̐sārādu
nikkisūḍaguṁḍam̐gānu nerubulu vasariṁchi
pĕkkumāḍa lāḍarādu pĕnam̐gārādu
(||em̐ṭi||)
sedigilonainayaṭṭi śhrīveṁkaḍeśhvaruni
kādariṁcharādu mari kādanārādu
yīdam̐ḍe nanniḍu gūḍi ichchagum̐ḍai vuṁḍam̐gānu
yedulu nĕrabarādu yĕla̮iṁchārādu