Emtigi vegirimchere yimtulaala

ఏఁటికి వేగిరించేరే యింతులాల
Language

(॥పల్లవి॥)
ఏఁటికి వేగిరించేరే యింతులాల
దాఁటపుదొర యాతఁడే కరుణించీఁ గాక

(॥ఏఁటి॥)
మనసెఱఁగక తొల్లే మాటలె ట్టాడఁగవచ్చు
ననిచినఁగాక యెట్టు నవ్వవచ్చును
మునుకు వెనకెంచక ముచ్చట లెట్టాడవచ్చు
ఘనుఁ డాతని తలఁపు గనుకొందమే

(॥ఏఁటి॥)
సరసమాడక తొల్లె చవులెట్టు గొనవచ్చు
పిరిగొన సోఁకకెట్టు పెనఁగవచ్చు
తెరదియ్య కెటువలె తేరకొనఁ జూడవచ్చు
గరిమె నాతనిబుద్ది గనుకొందమే

(॥ఏఁటి॥)
చేరువకు రాకతొల్లె సేస లెట్టు వెట్టవచ్చు
కూరిమెఱఁగక యెట్టు గొసరవచ్చు
యీరీతి శ్రీ వేంకటేశుఁ డింతలోనె నిన్నుఁ గూడె
గారవిం చాతనిమేలు గనుకొందమే

(||pallavi||)
em̐ṭigi vegiriṁchere yiṁtulāla
dām̐ṭabudŏra yādam̐ḍe karuṇiṁchīm̐ gāga

(||em̐ṭi||)
manasĕṟam̐gaga tŏlle māḍalĕ ṭṭāḍam̐gavachchu
nanisinam̐gāga yĕṭṭu navvavachchunu
munugu vĕnagĕṁchaga muchchaḍa lĕṭṭāḍavachchu
ghanum̐ ḍādani talam̐pu ganugŏṁdame

(||em̐ṭi||)
sarasamāḍaga tŏllĕ savulĕṭṭu gŏnavachchu
pirigŏna som̐kagĕṭṭu pĕnam̐gavachchu
tĕradiyya kĕḍuvalĕ teragŏnam̐ jūḍavachchu
garimĕ nādanibuddi ganugŏṁdame

(||em̐ṭi||)
seruvagu rāgadŏllĕ sesa lĕṭṭu vĕṭṭavachchu
kūrimĕṟam̐gaga yĕṭṭu gŏsaravachchu
yīrīdi śhrī veṁkaḍeśhum̐ ḍiṁtalonĕ ninnum̐ gūḍĕ
gāraviṁ sādanimelu ganugŏṁdame